Sunday, August 30, 2020

సప్తర్షిమండలం మారుతూవుంటుందా?

 సప్తర్షిమండలం మారుతూవుంటుందా?




సాహితీమిత్రులారా!

What are the Saptarishi? - Quora

మన హిందూసమాజంలో వివాహానంతరం

నూతన వధూవరులను అరుంధతీ దర్శనంకోసం

సప్తర్షిమండలంలోని అరుంధతీనక్షత్రం చూపడం

ఆచారం. అది కనిపిస్తుందా లేదా అన్నది వేరే అంశం.

అది ఉత్తరం వైపునకు చూపించి చెబుతుంటారు.

కాని అది దిశమారుతుందా. కాదు. మరి ఎలామారుతుంది

అంటే అది మన చంద్రుడు ప్రతిరోజు ఒక నక్ష్తత్రం దగ్గర 

వుంటాడు కదా అలాగట.

ప్రతివందసంవత్సరాలకు ఒక నక్షత్రం మారుతూవుంటుందట.

ఈ విషయం తిరుమల శ్రీనివాసశర్మగారు రచించిన వేదవాఙ్మయము

12 పుటలో వివరించడం జరిగింది. పరీక్షిత్తు పుట్టినపుడు మఘ నక్షత్రం

ఉన్నదని, నందుని రాజ్యాభిషేకసమయానికి పూర్వాషాఢ నక్షత్రం లో

సప్తర్షిమండలం ఉన్నట్లు ప్రాచీన విద్వాంసులు వివరించినట్లు చెప్పాడు.

ప్రతివంద సంవత్సరాలకు నక్షత్రం మారుతుందని వివరించం జరిగింది.

దీన్నిబట్టి సప్తర్షిమండలం మారుతూవుంటుందని అర్థమౌతున్నదికదా


1 comment:

  1. అయ్యా,
    ఇది వైఙ్ఞానికంగా శుద్ధ తప్పు.
    మారేది సప్త ఋషఋషి మండలం కాదు, ధృవ నక్షత్రం. కానీ వంద సంవత్సరాలలో కాదు. భూమి ఇరుసు ఇంచుమించు 26000 సంవత్సరాల తరువాత అదే నక్షత్రం వైపు ఉంటుంది.

    ReplyDelete