Sunday, August 23, 2020

కురుక్షేత్రయుద్ధంలో ఇరువైపు సేనానులు

 కురుక్షేత్రయుద్ధంలో ఇరువైపు సేనానులు
సాహితీమిత్రులారా!

భారత యుద్ధం

అంటే కురుక్షేత్రంలో

కౌరవుల సైన్యం  - 11 అక్షౌహిణులు

పాండవుల సైన్యం-  7 అక్షౌహిణులు

ఈ సైన్యాన్ని ఒక అక్షౌహిణి సైన్యనానికి 

ఒక సైన్యాధిపతి చొప్పున నియమించారు.

ఆ లెక్కన కౌరవులకు 11 మంది సైన్యాధిపతులు

పాండవులకు 7 మంది సైన్యాధిపతులు

వారిపై ఒక సర్వసైన్యాధ్యక్షుడుంటాడు

యుద్ధప్రారంభంలోని సైన్యధిపతులు

కౌరవుల సైన్యాధిపతులు -

1. కృపాచార్యుడు, 2. ద్రోణాచార్యుడు, 3. అశ్వత్థామ,

4. శల్యుడు, 5. జయద్రథుడు, 6. సుదక్షిణుడు,

7. కృతవర్మ, 8. కర్ణుడు, 9. భూరిశ్రవుడు,

10. శకుని, 11. బాహ్లికుడు.

వీరందరికి సర్వసైన్యాధ్యక్షుడు - 

10 రోజులు - భీష్ముడు

5రోజులు - ద్రోణుడు

2రోజులు - కర్ణుడు

1రోజు - శల్యుడు

వీరు కాక చివరిలో సైన్యమేలేకుండా

సైన్యాధిపతి అయినవాడు అశ్వత్థామ


పాండవుల సైన్యాధిపతులు -

1. ద్రుపదుడు, 2. విరాటుడు, 3. ద్రుష్టద్యుమ్నుడు 4.శిఖండి,

5. సాత్యకి, 6. చేకితానుడు, 7. భీమసేనుడు


వీరందరికి 18 రోజులు యుద్ధం ముగిసేదాక

సైన్యాధిపతి - ద్రుష్టద్యుమ్నుడు


7 comments:

 1. సమాచారం బాగుంది.
  అయితే తను చేసిన అస్త్రసన్యాసం ప్రకారం కర్ణుడు మొదటి పది రేజులూ ... అంటే భీష్ముడు పోరాడినన్ని రోజులూ ... యుధ్ధరంగంలో అడుగుపెట్ట లేదు కదా. మరి ఆ పదిరోజులూ అతడి అక్షౌహిణిని ఎవరు నడిపించినట్లు?

  ReplyDelete
  Replies
  1. ఇంతమంది పండితులు ఉన్న ఈ సభలో ఇంత చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు ఎవరూ!!

   Delete
  2. ఎవరో ఉప సైన్యాధిపతి నడిపించి ఉంటాడు.
   ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు, ఒక ఉప సైన్యాధిపతి అయినా ఉండడా?

   Delete
 2. ఒక అక్షౌహిణి ఇజీక్వల్టూ ౨౧౮౭౦ రథములు, ౨౧౮౭౦ కుంజరాలు, ౬౫౬౧౦ అశ్వాలు, ౧౦౯౩౫౦ ఇన్ఫాంట్రి బెటాలియన్ ఉంటుందిట..
  భీష్మునికి ఇచ్ఛామృత్యువు వరం ఉండటం మూలానా.. వేరే ఏ కౌరవునికి ముందుగానే సర్వసైన్యాధ్యక్షునిగా పెడితే మొదటికే మోసం కాగలదనే నెపంతో శకుని దుర్యోధనాదులు భీష్ముణ్ణి తొలుత సర్వసైన్యాధ్యక్షుని పదవి ఇస్తారు.. ఐతే గడచిన తొమ్మిది రోజులుగా అటు పాండవ సైన్యం లో కీలకమైన వారు ఇటు కీలకమైన కౌరవ సైన్యం వారు ఏ ఒక్కరిని కూడా హాని చేరకుండా ఇరు పక్షాలు ఐనవే అనట్టు భావిస్తుంటే శేశేదేవిలేక శిఖండి ని తెచ్చి అంపశయ్యాఘాతం చేసి తక్కిన ఎనిమిది రోజులు ఎండకు ఎండుతు వానకు తడుస్తు భీష్ముల వారు ఆయా రోజులలో యుద్ధం ఎలా సాగింది.. ఎవరు విజేత ఐతే వారికి ధర్మబొధ చేసి కాలం చేయాలని సంకల్పించి ఆ అంప మీదనే ఉంటారు. అతనికి తెలుసు కర్ణుడు కౌంతేయుడేనని.. కాకపోతే ముందే అతనిని అందరు రాధేయుడిగా పిలుస్తుండడం చేత క్షత్రీయ యుద్ధం చేయటం కుదరదని భీష్ముల వారు తీర్మానిస్తారు.. ఐతే ఒకవేళ నిరాకరించకుంటే అర్జునుణ్ణి తన దగ్గర ఉన్ప బ్రహ్మాస్త్రం తం అంతో గావించ వచ్చని తెలిసి ఒకింత సావధానమై.. ఆయా బెటాలియన్ బెటాలియన్ మొత్తం అతని అండర్ లోనే ఉండేది.

  ఇంతకు బ్లాగ్ గాంధి తాత గారెవురు బిజిలే అమ్మణ్..?

  తొలుత పది లోజురు భీష్ముని అండర్ లో ఉన్న బెటాలియన్ కాస్త తదుపరిగా ద్రోణూడికి.. అస్త్ర సన్యాసం చేశి అతనిని మార్టిర్ జేషినంక గపుడ్ కర్ణుణ్ణి.. అతని రథం కూరుకుపోయాక వధించిన పిమ్మట శల్యుణ్ణి.. సహదేవుని చేతిలో ఠా అయ్యాక తదుపరి దుర్యోధనుని నడ్డి ఇరిగినాక అశ్వత్థామ ను గ్రౌండ్ జీరో ఆర్మీ ఛీఫ్ ఆఫిసర్ గా చేస్తే ఇతను పాండవులనుకోని ఉపపాండవులను అంతమొందించి చూసెసరికె ఏముంది అంతా ఖల్లాస్.. అశ్వత్థామ జెమ్ ను కృష్ణస్వామి తీసుకుని పరిక్షితుణ్ణి రక్షించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించి అవతారము ముగించే సరికి అంత హింసతో కూడుకున్న హస్తిన మాకొద్ధు అంటు అందరు హిమాలయాలకు వెడుతారా ఒక నాయి దా వేలాడతా ఉండున్ వారితో.. వెడుతూనే ద్రౌపది ఢాం, ఆ తర్వాత నకులుడు జాటర్ ఢమాల్, సహదేవుడు సాగలేక ఉష్ ఫటాక్, సవ్యసాచి కూడా వెడుతు కుప్పకూలుతాడు, చివరాఖరుకి భీముడు ధనేల్.. తీరా యుధిష్టిరుడు ఒకడే ప్రాణాలతో స్వర్గం చేరి దేహం విడిచేలోపు సమవర్తి ఆ నాయి రూపాన్ని త్యజిస్తే క్లుప్తంగా మహాభాలతం.. (బీయార్ ఛోప్రా మహాభారతం నా బాల్యం లో చూసినా.. మల్ల కౌంట్ డౌన్ లో చూసినా.. )

  ReplyDelete
 3. శ్రీధర్ గారు,
  పలు భాషలు కలిపి వ్రాసిన మీ వ్యాఖ్యలో నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు (కర్ణుడు రణరంగంలోకి ప్రవేశించేటంత వరకు అతని అక్షౌహిణికు సేనాని ఎవరు?).

  సరే, ఇక ఇలా కాదు గానీ నా అంచనా చెబుతాను. (1). బోనగిరి గారు చెప్పింది సబబుగానే ఉంది. ఎవరో ఉప సేనాని ఉండే ఉంటాడనీ, అతను ఇన్-ఛార్జ్ గా వ్యవహరించి ఉంటాడనీ అనుకోవచ్చు. (2). లేదా ... తన మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలు కేటాయించగా మిగిలిన శాఖలను తన దగ్గరే ఉంచుకుంటారు గదా మన దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు? అలాగే కర్ణుడి అక్షౌహిణిని కూడా సర్వసైన్యాధ్యక్షుడిగా భీష్ముడు తన అధీనంలోనే ఉంచుకున్నాడేమో అనుకోవచ్చేమో?

  పెద్దలే చెప్పాలి.

  ReplyDelete
 4. శ్రీధర్ గారు,
  // “... తక్కిన ఎనిమిది రేజులు ఎండకు ఎండుతు వానకు తడుస్తు భీష్ముల వారు ....” //

  అంపశయ్యపై భీష్ముడి పరిస్ధితి చాలా బాధ కలిగిస్తుంది. ఎండా, వాన (కురిసింది అనుకుందాం కాసేపు) మాత్రమేనా విపరీతమైన చలి, మంచు పడడం కూడా ఉండే ఉంటుంది కదా ఎందుకంటే కురుక్షేత్రం ఉత్తర భారతదేశ ప్రాంతం, యుద్ధం జరిగింది చలికాలం లో. రాత్రుళ్ళు నక్కల ఊళలు (మాట వరసకు చెబుతున్నాను, అంతే కానీ వీటికి భీష్ముడు భయపడతాడని కాదు). భరించలేనంత ఏకాంతం. శరీరంలో గుచ్చుకున్న బాణాల పీడ (అసలు అర్జునుడు ముసలాయన శరీరంలో అన్ని బాణాలు ఎందుకు గుచ్చాడో నాకైతే అర్థం కాదు) అబ్బో, పగవాడికి కూడా వద్దు.

  పై రకమైన స్ధితిలో కురుక్షేత్ర భూమిపై భీష్ముడు పడి ఉన్నది .... మీరన్న ఎనిమిది రోజులు మాత్రమే కాదు. యుద్ధం ముగిసిన తరువాత తన మరణం వరకు 58 రోజులు అంపశయ్యపై గడిపాడట 🙏.

  ReplyDelete
  Replies
  1. నిజమే గురువర్య.. అసలు తాను చేసిన ప్రణతిని నిలబెట్టుకోవటానికి అష్టవసువుల్లో ఒకరైన దేవవ్రతుల వారు ఆజన్మాంతం హస్తినాపుర సామ్రాజ్యానికి ఈ కాలపు కోడురి శ్రీశైల శ్రీ రాజమౌళి గారు తెరకెక్కించిన బాహుబలి లో కట్టప్ప కంటే కూడా వినయ విధేయలతో చివరి వరకు బాధను, నొప్పిని.. మీరన్నట్లు చలిని.. ఇతరత్ర ప్రాకృతిక విపత్తులను ఎదురుకున్నారు. భారతమంత ఒక ఎత్తైతే భీష్ముల వారి త్యాగం మరో ఎత్తు.. సాక్షాత్తు శ్రీకృష్ణుల వారి సమక్షంలో తుదిశ్వాస విడవటం నిజంగా భీష్ముల వారు చేసుకున్న సుకృతమనే చెప్పాలి.

   Delete