Sunday, August 9, 2020

ఆరు నంబరు గది

 ఆరు నంబరు గది





సాహితీమిత్రులారా!


H.M.T.V. నిర్వహణలో వందేళ్ళకథకు వందనం

సాహిత్య సంచిక కార్యక్రమంలో

ఇంద్రగంటి హనుమనుమత్ శాస్త్రిగారి కథ

ఆరు నంబరు గది

సంపాదకులు గొల్లపూడి మారుతీరావు నిర్వహణ

వీడియో వీక్షించండి-


Friday, August 7, 2020

వినోదప్రదర్శన(కథ)

 వినోదప్రదర్శన(కథ)




సాహితీమిత్రులారా!


దూరదర్శన్ వారు 

మధురాంతకం రాజారాం గారి కథలను 

ప్రసారం చేశారు వాటిని 

మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 

మీ ముందుంచుతాను వాటిలో 

ఇప్పుడు వినోదప్రదర్శన అనే కథ వీక్షించండి-


Wednesday, August 5, 2020

అప్పల నరసయ్య


అప్పల నరసయ్య




సాహితీమిత్రులారా!

దూరదర్శన్ వారు 
మధురాంతకం రాజారాం గారి కథలను 
ప్రసారం చేశారు వాటిని 
మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 
మీ ముందుంచుతాను వాటిలో 
ఇప్పుడు అప్పల నరసయ్య అనే కథ వీక్షించండి-

Monday, August 3, 2020

అత్తాతోడికోడలీయం

అత్తాతోడికోడలీయం




సాహితీమిత్రులారా!

మన తెలుగులో పాతతరం నటీమణులలో 
భానుమతి అందరికీ సుపరిచితురాలే. 
ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. 
ఆమె కథలను గురించిన
విషయం సాహిత్యసంచిక కార్యక్రమంలో  
సంపాదకుడు
 గొల్లపూడి మారుతీరావుగారు 
ఆమె కుమారుడు డా. భరణిగారు
చర్చించిన వీడియో H.M.T.V. వారి 
వందేళ్ళ కథకు వందనాలు శీర్షికలో
అత్తాతోడికోడలీయం వందేళ్ళనాటి కథ
ప్రసారం చేశారు. ఆవీడియో వీక్షించండి-



Saturday, August 1, 2020

మధురాంతకం రాజారాం కథలు (ప్రియబాంధవి)


మధురాంతకం రాజారాం కథలు (
ప్రియబాంధవి)





సాహితీమిత్రులారా!

దూరదర్శన్ వారు 
మధురాంతకం రాజారాం గారి కథలను 
ప్రసారం చేశారు వాటిని 
మన పాఠకులు దర్శిస్తారని వీలైనన్ని 
మీ ముందుంచుతాను వాటిలో 
ఇప్పుడు ప్రియబాంధవి అనే కథ వీక్షించండి-



Thursday, July 30, 2020

ఒక నాలుకతో పదివేల అబద్దాలు

ఒక నాలుకతో పదివేల అబద్దాలు




సాహితీమిత్రులారా!

పెరంబూదూరు రాఘవాచార్యుల వారి చాటుపద్యం చూడండి-
నల్లగొండ జిల్లా చందుపట్ల గ్రామపు దేశముఖ్ నరసింహారెడ్జి,
గ్రామంలోని సీతారామచంద్రస్వామివారి దేవాలయపు భూములను
కబ్జా చేసి అర్చకులైన రాఘవాచార్యుల కుటుంబాన్ని నానాబాధలు పెట్టాడట
ఆ సందర్భములో చెప్పిన పద్యం ఇది.

ఉరగధవుండు ప్రజ్ఞగల యుత్తముడంచు వచింప రెండువే
ల్గరు సగు నాల్కలుండిన నొకప్పుడు గొప్పని బొంకలేడహో
నరుడగు చందుపట్ల నరనాథుడు నర్సని ప్రజ్ఞ యెట్టిదో
గురుతగు నొక్క నాల్క పది కోటులు బొంకును ప్రత్యహం బిలన్


సర్పరాజైన శేషుడు ప్రజ్ఞావంతుడని ఉత్తముడని ప్రసిద్ధి పొందాడు.
అతనికి వేయి తలలు, రెండువేల నాలుకలు ఉన్నాయి. అయినా
అతడు ఒక్క అబద్ధం కూడ పలుకలేడు. కాని మనిషయిన మా గ్రామపు
దొర మాత్రం ప్రతిరోజు ఒక్కనాలుకతోనే పదికోట్లు బొంకులాడుతాడు.
ఆ నరసని ప్రజ్ఞ ఎంత గొప్పదోకదా! - అని భావం

Monday, July 27, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం




సాహితీమిత్రులారా!


శ్రీనాథుడు "ఫుల్లసరోజనేత్ర అల పూతన చన్నుల చేదుద్రావి" -
అనే పద్యం శ్రీకృష్ణునిమీద చెబితే
పెరంబూదూరు రాఘవాచార్యులుగారు
శంకరునిమీద ఈ పద్యం చెప్పాడు చూడండి.

గరళంబుం దిగ మింగినానని మహాగర్వంబుచే నుంటి వీ
వరయంగా మునగాల సీమ ఫలితం బై పేరు జెన్నొందుబం
దరు పొట్టీల ప్రసాదముం దినినమీ దన్ శ్రీధరాఖ్యుండవీ
కరణిన్మెక్కకపోతివేని బిరుదుల్గాల్పందగున్ శంకరా!

ఈ పద్యం నేటి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా
చందుపట్ల గ్రామనివాసి అయివ
పెరంబూదూరు రాఘవాచార్యులు గారు
వారానికొకసారి కోరాడ ప్రాంతపు మునగాల
పరగణాలోని గంగిశెట్టి గూడెం(బరాఖత్ గూడెం) అనే
గ్రామంలోని దేవాలయ ఉత్సవయాజ్ఞీకానికి వెళ్ళినపుడు
అక్కడివారు వడ్డించిన అన్నం తినలేక వ్యంగ్యంగా చెప్పినది.

ఓ శంకరా! నీవు పూర్వం హాలాహలం మ్రింగినానని చాల గర్వంతో ఉన్నావు.
కాని ఈ మునగాల సీమలో పండే బందరు పొట్టీల(ఒకరకం బియ్యం) అన్నం తిని
హరించుకుంటే అప్పుడు నిన్ను శ్రీధరుడు (విషాన్ని ధరించినవాడు) అని పిలువచ్చు.
ఆ అన్నం తినలేకపోతే నీకున్న ఆ బిరుదులు కాల్చదగినవి గాని సార్ధకమైనవికావు -
అని వ్యంగ్యంగా హాస్యపూరితంగా చెప్పాడట.