Friday, July 3, 2020

బంగారానికి ఎన్ని పేర్లున్నాయి?


బంగారానికి ఎన్ని పేర్లున్నాయి?




సాహితీమిత్రులారా!

బంగారానికి గల పేర్లను
మాంగల్యశాస్త్రంలో కపిలవాయి లింగమూర్తి
108 పేర్లు చెప్పాడు అవి-

బంగారానికి అకారాది పేర్లు
(సంస్కృతం)
1. అకుప్యం, 2. అగ్ని, 3. అగ్నిబీజం, 4. అగ్నిజం, 5. అగ్నిభం
6. అగ్నిరజస్సు, 7. అగ్నివీర్యం, 8. అగ్నిశిఖ, 9. అగ్నిశేఖరం, 10. అభ్రం, 11. అమరం, 12. అర్జనం, 13.అవష్టంభం, 14. అష్టాపదం, 15. అగ్నేయం, 16.ఉజ్వలం, 17. ఔజసం, 18. కందళం, 19. కటంకటం, 20.కనకం, 21. కర్పూరం, 22. కలధౌతం, 23. కల్యాణం, 24. కాంచనం, 25. కాచిఘం, 26.కార్తస్వరం, 27.కుమారం, 28. కౌసుంభం, 29.గరుత్తు, 30. గాంగేయం, 31. గైరికం, 32. చంద్రం, 33.చాంపేయం, 34. చామీకరం, 35.జాంబవం, 36. జాంబూనదం, 37. జాతరూపం, 38. తపనీయం, 39.తామరసం, 40. తారజీవనం, 41. తాజం, 42. దళపం, 43. దాక్షాయం, 44. దీప్తకం, 45. దీప్తి, 46. ద్రవిణం, 47. నందయంతి, 48. నిష్కం, 49. పవిత్రం, 50. పింగాశం, 51. పింజరం, 52. పింజానం, 53. పీయువు, 54. పురరం, 55. భద్రం, 56.భరువు, 57.భర్మం, 58. భాస్కరం, 59. భూత్తమం, 60. భూరి, 61. భృంగారం, 62. మాంగల్యం, 63. మనోహరం, 64. మహాధనం, 65. మహారజతం, 66. హమారజతసం, 67. ముఖ్యధాతువు, 68. మృదాన్నకం, 69. రజతం, 70. రత్నవరం, 71. రసనం, 72. రుక్మకం, 73. రేకణం, 74. లోభనం, 75. లోహవరం, 76. వర్ణం, 77. వసువు, 78. వహ్నిజం, 79. శాతకుభం, 80. శిలోద్భవం, 81. శుక్రం, 82. శ్రీమకుటం, 83. సంచం, 84. సానసి, 85. సారంగం, 86. సురభి, 87. సువర్ణకం, 88. సౌమంజకం, 89. సమేచకం, 90. సౌమేవరం, 91. సౌవర్ణం, 92. స్పర్శమణి ప్రభవం, 93. స్వర్ణం, 94. హాటకం, 95. హారిద్రం, 96. హిరణ్యం, 97. హేమం
తెలుగు పేర్లు -
98. కడవన్నె, 99. కుందనం, 100. చిన్నిదం, 101. జమ్మేరుజంబాలం, 102.దినారి, 103. పసిడి, 104.పుత్తడి, 105. పైడి, 106. పొన్ను, 108. బంగరం, 109. బంగరు, 110. బంగారం, 111. బంగారు, 112. హొన్ను

(ఇందులో కొన్ని రూపాంతరాలున్నాయి. మొత్తం 108 పేర్లు)

4 comments:

  1. ఇన్ని పేర్లు ఉన్నాయా బంగారానికి. అద్భుతం. ఆంగ్లం లో ఒకే పేరు ఉంది గోల్డ్. బంగారము ను రజతం అని కూడా ఉందా.

    ReplyDelete
  2. “అపరంజి” లేదే పైన లిస్టులో?
    “రజతం” అంటే వెండి కదా?

    ReplyDelete
    Replies
    1. సాహితీమిత్రులకు ధన్యవాదాలు
      మాంగల్యశాస్త్రంలో ఇచ్చిన పేర్లు మాత్రమే ఇక్కడ ఇచ్చాను
      అపరంజి అనేది అందులో లేదు. రజతం అనేది వెండి అనే వినియున్నాం కాని ఇందులో బంగారం పేర్లలో ఇచ్చారు.

      Delete
  3. Good information
    Highlighting the important in formation of the book

    please give your phone number

    my number is 8790727772

    ReplyDelete