Thursday, June 9, 2022

బ్రాహ్మణులు... భోజనప్రియులు

 బ్రాహ్మణులు... భోజనప్రియులు




సాహితీప్రియులారా!

బ్రాహ్మణులు... భోజనప్రియులు

మల్లాది వారి వీడియో ఆస్వాదించండి-




1 comment:

  1. నేనొప్పుకోను రాజు గారు.
    మహాభారతంలో అలా వ్రాసుందనే అనుకున్నా, దానికి మల్లాది వారు తన స్వంత కవిత్వంతో ఎంత అతిశయోక్తులు కలిపి పచ్చళ్ళు పులుసుల గురించి వర్ణించినా …. నేనొప్పుకోలేను.

    మంచి భోజనాన్ని ఏ కులం వారైనా సరే ఆస్వాదించరా? ఒక కులానికి మాత్రమే ఆపాదించి ప్రచారం చెయ్యడం అన్యాయం.

    నిద్రకుపక్రమించినప్పుడు కూడా ఆ కులం వారు ఎప్పుడూ భోజనం గురించే చర్చించుకుంటూ కాలక్షేపం చేస్తారు అనే అర్థం వచ్చేట్లు సిద్ధాంతీకరించడం కూడా ఆ కులం వారికి అన్యాయం చేసినట్లే. వేరే అంశాలుండవా ఏమిటి మాట్లాడుకోవడానికి? వారికీ ఇతరత్రా పనులు, లక్ష్యాలు, హైరానలూ కూడా ఉంటాయి … ఆ తాపత్రయంలోనే పడి బతుకుబండి లాగిస్తుంటారు … తతిమ్మా అన్ని కులాలవారి లాగానే. ఆ సమస్యల గురించి చర్చించుకోరా - అందరి లాగానే? ఎప్పుడూ తిండి గురించే మాట్లాడుకుంటారా? ధృష్టద్యుమ్నుడు తన తండ్రితో అలా అని ఉంటే అది ఆ కుర్రవాడి తెలివితక్కువ మాట.

    స్వయంవర విజేతది ఏ కులమో కనిపెట్టడానికి మహాభారతంలో ఇచ్చిన వివరణ ఇదే గనక అయితే అది సహేతుకమైనది కాదంటాను. బ్రాహ్మణులైతే ఎల్లవేళలా భోజనం గురించే మాట్లాడుకుంటారు, కానీ వీళ్ళు అస్త్రశస్త్రాల గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి బ్రాహ్మణులు కారు అన్నది సబబుగా లేదు. బ్రాహ్మణుల్లో మాత్రం వీరులు లేరా (ఈనాటి భారతసైన్యంలో కూడా), వాళ్ళు అస్త్రాల గురించి మాట్లాడుకునుండరా?

    ఆ మాటకొస్తే బ్రాహ్మణేతరుడైన భీముడ్ని మించిన భోజనప్రియులుంటారా? ఈ నాటి సినిమాల్లో చూపించే భోజనాల సీన్లు చూడండి - బ్రాహ్మణేతరులు ఎంత భోజనప్రియులో తెలుస్తుంది.

    కాబట్టి ఈ నానుడి బ్రాహ్మణకులాన్ని అవమానపరచడమే అన్నది నా గట్టి అభిప్రాయం.

    ReplyDelete