Friday, December 10, 2021

నాలుగు గడియలలో చెరువు ఎండింది

 నాలుగు గడియలలో చెరువు ఎండింది




సాహితీమిత్రులారా!



రెడ్డిరాజుల యుగంలో ఉన్న బడబానల భట్టు 

ఏవూరివాడో తెలియదు కాని ఒకసారి ఆయన 

త్రిపురాంతకం నుండి శ్రీశైలం వెళుతూ 

ఒకచోట మకాం చేశాడు. తెల్లవారుజామున స్నానం చేసి 

సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నపుడు చేతి ఉంగరం జారి చెరువులో పడింది 

వెంటనే అతడు ఏడింట టకారం పెట్టి ఈ పద్యం చెప్పాడు


బడబానల భట్టారకు

కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం

బిడువేళ నూడి నీలో

బడియె దటాకంబ నీటి బాయుము వేగన్


ఈ పద్యం చెప్పిన రెండు గడియలలో చెరువు ఎండిందట 

కవిగారు తన ఉంగరం తీసుకొని చక్కాపోయాడు- అని 

అప్పకవి తన అప్పకవీయంలో ఈ పద్యాన్ని పొందుపరిచాడు.

No comments:

Post a Comment