B. Saroja Devi is an Indian actress who has acted in Kannada, Tamil, Telugu and Hindi films. She acted in around 200 films for more than six decades. She is known by the epithets "Abhinaya Saraswathi" in Kannada and "Kannadathu Paingili" in Tamil. She is one of the most successful actresses in the history of Indian cinema. KiranPrabha narrates the life sketch of B.Saroja Devi in this talkshow.
దేవుణ్ణి చూసినవాడు - దేవరకొండ బాలగంగాధర తిలక్ । కథ
సాహితీమిత్రులారా!
గవరయ్య ఆ ఊళ్ళో ఓ వింతమనిషి. అకారం వికారం. ఎవ్వరితో మాట్లాడడు, ఎప్పుడూ నవ్వడు, బస్తీలో వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించినా పైసా దానం చెయ్యడు. మున్సబు, కరణం ఎంత ప్రయత్నించినా అతడి వద్దనుంచి పైసా కూడా విరాళం తీసుకోలేకపోయారు. మొదటి భార్య కాలుజారి నూతిలో పడి చనిపోయింది. తనకంటే పదిహేనేళ్ళు చిన్నదైన అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎవ్వర్నీ ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు. ఎలా జరిగిందో ఏమో, రెండో భార్య ఎదురింట్లో ఉండే దర్జీతో లేచిపోయింది. అప్పుడేం జరిగింది? అసలు గవరయ్య వింతప్రవర్తనకు కారణమేమిటి? తన పరిధిలో తను బ్రతికే గవరయ్య దుర్మార్గుడు కాదు కదా. ఐనా ఊళ్ళో వాళ్ళందరికీ అతనంటే ఎందుకంత ద్వేషం? ఇంతకీ అతడు 'దేవుణ్ణి చూసినవాడు ' ఎలా అయ్యాడు? ఎప్పుడయ్యాడు? దేవరకొండ బాలగంగాధర తిలక్‌గారి అత్యద్భుత కథనంతో సాగే కథ. పరిచయం, విశ్లేషణ - కిరణ్‌ప్రభ
రాజశేఖర చరిత్రము అనే నవలను రచించింది కందుకూరి వీరేశలింగం పంతులుగారు. తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారి రాసిన “శ్రీ రంగరాజ చరిత్రము”ను చాలామంది పేర్కొంటుంటారు కానీ, ఆధునిక నవలా లక్షణాలను సంపూర్ణంగా పుణికిపుచ్చుకున్న తొలి తెలుగు నవల మాత్రం ఈ రాజశేఖర చరిత్రమే అన్నది చాలామంది భావన. నిజానికి ఆ తరువాత కాలంలో వచ్చిన నవలలు అన్నింటికీ ఈ రాజశేఖర చరిత్రే మార్గదర్శకంగా నిలిచింది. ఇక మనం కథలోకి వెళదాం..
అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న తొలి అమెరికన్ రచయిత | జాక్ లండన్
సాహితీమిత్రులారా!
Jack London (January 12, 1876 – November 22, 1916) was an American novelist, journalist and activist. A pioneer of commercial fiction and American magazines, he was one of the first American authors to become an international celebrity and earn a large fortune from writing. KiranPrabha narrates the interesting incidents in Jack London's life.
ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం
సాహితీమిత్రులారా!
ఓరుగల్లును రాజధానిగా చేసుకుని త్రిలింగదేశాన్ని పరిపాలించిన మహారాజు ప్రతాపరుద్రుడు. ఆయన పేరుతో నడిచే ఈ కథలో కీలక పాత్ర మాత్రం మహామంత్రి యుగంధరుడిది. వందలయేళ్ల క్రితం నాటి ఈ కథ జానపదుల నోళ్లలో నానుతూ, తరతరాలుగా ముందుకు సాగుతూ వచ్చింది. అలా వచ్చిన ఆ కథ తెలుగువారికి ప్రాతఃస్మరణీయులైన వేదం వేంకటరాయశాస్త్రి గారి చెవిన పడింది. అప్పుడాయనకు సుమారుగా ఎనిమిదేళ్లు. తన తండ్రి చెప్పగా విన్న ఆ కథ వేదంవారి హృదయలో నాటుకుపోయింది. ఆ తరువాత కాలంలో వేంకటరాయశాస్త్రిగారు పెరిగి పెద్దవారయ్యాక కథలోని పాత్రల్ని, సన్నివేశాల్నీ పెంచి 1897లో అంటే సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రీయం అనే పేరుతో నాటకంగా రచించారు. ఆ నాటకానికి దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. తెలుగు సాహిత్యంలోనే అత్యుత్తమ నాటకాలలో ఒకటిగా పేర్కొనే ప్రతాపరుద్రీయం కథలోకి ప్రవేశిద్దాం
మనకు “కూనలమ్మ పదాలు” అనగానే ఆరుద్రగారే గుర్తుకు వస్తారు. కానీ నిజానికి ఈ కూనలమ్మ పదాలన్నవి చాలా ప్రాచీనమైనవి. జానపదులు వందల సంవత్సరాలుగా పాడుకుంటోన్న ఈ కూనలమ్మ పదాలలో మనకు దొరికినవి కేవలం 8 పదాలే. వీటిని సేకరించి తెలుగు జాతికి అందించిన మహనీయులు, పరిశోధనా పరమేశ్వరుడిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. ఆయన ఈ 8 కూనలమ్మ పదాలను 1930వ సంవత్సరంలో భారతి పత్రికలో బాలభాష అనే శీర్షిక క్రింద ప్రచురించారు. వాటిని ఆస్వాదించండి-
పాల్కురికి సోమనాథుడు రచించిన ఈ బసవ పురాణం ఒక ద్విపద కావ్యం. ద్విపద అనేది మన తెలుగులో ఓ ఛందోరీతి. ఈ ద్విపద పద్యానికీ రెండే పాదాలుంటాయి. పాడుకోవడానికి చాలా హాయిగా ఉండే ఈ ద్విపదలకు కావ్య గౌరవం కల్పించిన కవి పాల్కురికి సోమనాథుడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ మహాకవి శివ కవిత్రయంగా పేరుమోసిన ముగ్గురు కవులలో ఒకడు. మిగిలిన ఇద్దరూ నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర అనే కావ్యాలు సోమనాథుని తెలుగు సాహిత్యంలో చిరంజీవిని చేశాయి. ఈ కవి మన తెలంగాణాలో వరంగల్లుకు సమీపంలో ఉండే పాల్కురికి అనే గ్రామంలో పుట్టాడు. సోమనాథుడు తెలుగులోనే కాదు కన్నడ, సంస్కృతాలలో కూడా రచనలు చేసిన మహాకవి. ఇక బసవపురాణం విషయానికి వస్తే.. ఇందులో బసవేశ్వరుని చరిత్రతో పాటూ బెజ్జమహాదేవి, కన్నప్ప, సిరియాళుడు మొదలైన ఎందరో శివభక్తుల కథలున్నాయి. బసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన చారిత్రక పురుషుడు. ఆ బసవేశ్వరుడు మరణించిన కొద్దికాలానికే పాల్కురికి సోమనాథుడు జన్మించాడు. అందుకే బసవపురాణంలో విషయాలు అసలు చరిత్రకు చాలా దగ్గరగా ఉండవచ్చన్నది పరిశోధక పరమేశ్వరులైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి మాట. ఇక కథలోకి వెళదాం.