Tuesday, November 8, 2016

అందరికంటె మిన్న ఎవరు?


అందరికంటె మిన్న ఎవరు?



సాహితీమిత్రులారా!



ఈ ప్రపంచంలో అందరికంటె మిన్న
అయినది ఎవురు అనేది ఈ నీతిశాస్త్ర
శ్లోకం చెబుతున్నది చూడండి-


ఉపాధ్యాయాన్ దశాచార్య:
ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పిత్రూన్ మాతా
గౌరవే ణాతిరిచ్య తే


ఎవరిని పడితే వారిని 'గురు'
అని పిలవడం కొందరికి
అలవాటైపోయింది.
ఇది మంచి పద్ధతికాదు.
గురువులలో రకాలున్నారు.
పదిమంది ఉపాధ్యాయులకంటె
ఒక ఆచార్యుడు మిన్న
నూరుగురు ఆచార్యులకంటె
తండ్రి మిన్న
అటువంటి వెయ్యిమంది
తండ్రులకంటె ఒక తల్లి మిన్న
కాబట్టే తల్లిని ప్రథమగురువు అన్నారు.
అందరికంటె మిన్నగా గౌరవించదగినది
ఒక్క తల్లియే- అని శ్లోక భావం

No comments:

Post a Comment