Sunday, November 13, 2016

మా తెలుగువాడు


మా  తెలుగువాడు



సాహితీమిత్రులారా!





వసంతరాయ కృష్ణారావుగారు
తెలుగువాడిని గురించి వ్రాసిన
ఈ సీసపద్యం చూడండి-


కలము ఖడ్గము పట్టగల నేర్పు రూపించి 
             వెలుగొందు వాడు మా తెలుగువాడు 
నిర్మలం బగునట్టి ధర్మము పాటించి 
             దీపించువాడు మా తెలుగువాడు
మాతృదేశ విముక్తి మహిత యజ్ఞంబున 
             విలసిల్లువాడు మాతెలుగువాడు
విహితమౌ సహనంపు సహజీవనంబును 
             వెలయించువాడు మా తెలుగువాడు
ఆంధ్రుడే కద భరత భాగ్యాధినేత 
ఆంధ్రుడే యగు విశ్వవిఖ్యాతమూర్తి
ఉజ్వ లాదర్శ రాష్ట్ర మహోత్సవమును
జరుపుచున్నాము సమధికోత్సహ గరిమ


ఇందులో చక్కని శైలి, లలిత పద ప్రయోగ నైపుణి,
సమయోచిత పదగుంభనం, రాష్ట్రభక్తి, దైవభక్తి
కృష్ణారావుగారి కవిత్వ వైఖరికి నవ్య నాద మాధురిని
కూర్చయని చెప్పవచ్చు.

No comments:

Post a Comment