Tuesday, August 31, 2021

తన వెంటన్ సిరి .......

 తన వెంటన్ సిరి  .......




సాహితీమిత్రులారా!



నీలంరాజు వెంకటశేషయ్యగారు రాసిన "నడిచే దేవుడు" పుస్తకంలోని విషయం ఇది. జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వాములవారి దగ్గరకు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాశి రామమూర్తి(రేణు)గారు వెళ్ళి మాట్లాడు
సందర్భంలో రేణుగారు
గజేంద్రమోక్షణం ఘట్టంలోని-

"తన వెంటన్ సిరి లచ్చివెంట నవరోధ వ్రాతము న్దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుకౌమోదకీ శంఖచ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాల గోపాలమున్"

అనే పద్యాన్ని చదవగానే,
దానిని విని స్వామి,
ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదనీ
అది పోతన కాలానికి పూర్వపుదే అయితే
బహుశా పోతన దానిని విని ఉండవచ్చునని అన్నారు.

ఆ ఆభాణకం గురించి తాము విననే లేదని,
దానిని శ్రుతిపరచండనీ పుట్టపర్తివారు అభ్యర్ధించారు స్వామిని.
ఒకటి రెండునిమిషాలు ఆగి, స్వామి ఇలా చదివారు-

"లీలాలోలతమాం రమా మగణయన్ నీల మనాలోకయన్
ముంచన్ కించ మహీం, అహీశ్వర మయం ముంచన్ హఠాద్వంచయన్
ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం
శ్రీదోవింద ఉది త్వరత్వర ఉదైత్ గ్రాహగ్రహార్తం గజమ్"

ఈ శ్లోకం ఒకటి ఉన్నట్లు పుట్టపర్తి వారికీ,
రేణుగారికి తెలియదు.
తెలియని వారింకెందరో!

Sunday, August 29, 2021

సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నిందా!

సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నిందా!




సాహితీమిత్రులారా!

సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తన్నిందని

చాలామంది భావిస్తుంటారు

దానికి సంబంధించిన విషయాన్ని 

ఈ వీడియోలో ఆస్వాదించండి-  



Friday, August 27, 2021

“జలపాతం” – రేడియో నాటకం

 “జలపాతం” – రేడియో నాటకం 




సాహితీమిత్రులారా!

“జలపాతం” – రేడియో నాటకం 

నవలా మూలం  – యద్దనపూడి సులోచన రాణి

రేడియో అనుసరణ – పి.శేషుబాబు 

నిర్వహణ – వి.రతన్ ప్రసాద్

ప్రసారం - ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం

ఆస్వాదించండి-




Wednesday, August 25, 2021

శ్రీశ్రీ పద్యాలు - 2

శ్రీశ్రీ పద్యాలు - 2




సాహితీమిత్రులారా!



శ్రీశ్రీ మరో మూడు యాభైలు నుండి-

మీసాలకు రంగేదో

వేసేస్తే యౌవనం లభించదు నిజమే

సీసా లేబిల్ మార్చే

స్తే సారా బ్రాంది యగునె సిరి సిరి మువ్వా!


ఉగ్గేల త్రాగుబోతుకు

ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో

విగ్గేల కృష్ణశాస్త్రికి

సిగ్గేలా భావకవికి సిరి సిరి మువ్వా!


నేనూ ఒక మూర్ఖుణ్నే

ఐనా నాకన్న మూర్ఖులగపడుతుంటే

ఆనంద పారవశ్యము

చె నవ్వక తప్పలేదు సిరి సిరి మువ్వా!


హాస్య రచనలో నొక్క ర

హస్యం  కలదనగ వచ్చు నది యేదన్నన్

వేశ్యా మాతల సన్నిధి

శిష్యరికం ఆరు నెలలు సిరి సిరి మువ్వా!


Monday, August 23, 2021

సరదా సంసారం – రేడియో హాస్య నాటిక

సరదా సంసారం  –  రేడియో హాస్య నాటిక




సాహితీమిత్రులారా!

సరదా సంసారం  –  రేడియో హాస్య నాటిక

రచన: శ్రీ మాడుగుల రామకృష్ణ

ప్రసారం- ఆలిండియా రేడియో

ఆస్వాదించండి-



 

Saturday, August 21, 2021

మహాభారతం గురించిన శాస్త్రీయ ఆధారాలు

మహాభారతం గురించిన శాస్త్రీయ ఆధారాలు




సాహితీమిత్రులారా!

మహాభారతాన్ని గురించిన శాస్త్రీయ ఆధారాలను

Nilesh Oak గారు యూటూబ్ లో ఇచ్చిన వీడియో

ఆస్వాదించండి-



Thursday, August 19, 2021

శ్రీశ్రీ పద్యాలు

శ్రీశ్రీ పద్యాలు





సాహితీమిత్రులారా!



శ్రీశ్రీ గారి  సిరి సిరి మువ్వలోని కందపద్యాలు

ఆస్వాదించండి-


కందం తిక్కన గారిది,

కుందవరపువారి ముద్దు కుర్రని దంతే

అందరి తరమా కందపు

చిందుల కిటుకుల్ గ్రహింప, సిరి సిరి మువ్వా


యుద్ధం పోతేనేం వా

గ్యుద్ధాలూ కాగితాల యుద్ధాలూ లో

కోద్ధరణ పేర మళ్ళీ

సిద్ధమురా కుందవరపు సిరి సిరి మువ్వా


గొర్రెల మందగ, వేలం

వెర్రిగ ఉద్రిక్త భావ వివశులయి జనుల్

కిర్రెక్కి పోయినప్పుడు

చిర్రెత్తుకు వచ్చు నాకు సిరి సిరి మువ్వా


ఈ రోజులలో ఎవడికి

నోరుంటే వాడె రాజు, నూరుచు మిరియాల్

కారాలు, తెగ బుకాయి

స్తే రాజ్యాలేలవచ్చు సిరి సిరి మువ్వా


జగణంతో జగడం కో

రగా దగదు కాని, దాని ఠస్సాగొయ్యా

నగలాగ వెలుగును గదా

చిగిర్చితే నాలుగింట సిరి సిరి మువ్వా

 

Tuesday, August 17, 2021

పెళ్లి బేరం రేడియో హాస్యనాటిక

 పెళ్లి బేరం రేడియో హాస్యనాటిక





సాహితీమిత్రులారా!

పెళ్లి బేరం రేడియో హాస్య నాటిక

రచన- ఏ.బి. ఆనంద్

ఆకాశవాణి ప్రసారం-



Sunday, August 15, 2021

దేవాలయ శిల్పాలలో జెనటిక్, డిఎన్ ల ప్రతిభ

 దేవాలయ శిల్పాలలో 

జెనటిక్, డిఎన్ ల ప్రతిభ





సాహితీమిత్రులారా!

దేవాలయ శిల్పాలలో మన పూర్వులు

జెనటిక్ డిఎన్ ల ప్రతిభను ఎలా ప్రదర్శించారో 

ఈ వీడియోలో వీక్షించగలరు-




Friday, August 13, 2021

తెలుగు పద్యాల ప్రత్యేకత

 తెలుగు పద్యాల ప్రత్యేకత




సాహితీమిత్రులారా!



పసుపులూరి సోమయాజకవి
ఇందూ! నందుని మందనుండి కద నీ వేతెంచుటల్ రాకలన్-
అనే మకుటంతో 116 పద్యాలు లలిత శృంగార సుందరంగా
రచించాడు. శార్దూలాల్లో ఇన్ని పద్యాలు ఇంతమృదుమధరంగా
రాయటం చాలా కష్టం. రసానుగుణమైన వృత్తాలు ఇవి. అందులో
శార్దూలం గంభీరమై వీరరౌద్ర రసాలకు పనికివస్తుందని
సంస్కృతాలంకారికులు చెబుతారు. మరి తెలుగు కవులు
ఈ నిబంధనను అంతగా పట్టించుకున్నట్లు కనిపించదు.
చంపకమాలలో భీషణత్వాన్ని శార్దూలంలో మార్దవాన్ని
సృష్టంచడం తెలుగువారి సొమ్మని పెద్దలు కొందరు చెబుతారు.
సుందరమైన ఈ శార్దూల పద్యం చూడండి-


బృందారణ్యము సేమమా అచటి గో బృందంబులున్ లెస్సలా
నందుండున్ సతియున్ సుఖాన్వితులె నానా గోపగోపాలికా
సందోహంబులతో హలాయుధుడు కృష్ణస్వామి క్రీడింతురా

ఇందూ! నందుని మందనుండి కద నీ వేతెంచుటల్ రాకలన్



తిరుపతి వేంకటేశ్వరుల ఉద్యోగ విజయాలలోని ఈ పద్యం-

బావా! ఎప్పుడు వచ్చతీవు? సుఖులే భ్రాతల్ సఖుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమము మై నెసంగుదురె నీ తేజంబు వెల్గించుచున్


వంటి పద్యాలకు సోమరాజు
మార్గదర్శకుడు అంటే అతిశయోక్తి
అత్యుక్తి కాదు

Wednesday, August 11, 2021

కీలెరిగిన వాత - నాటకం

 కీలెరిగిన వాత - నాటకం 





సాహితీమిత్రులారా!

కీలెరిగిన వాత - నాటకం 

రచన - శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి

ప్రసారం- ఆకాశవాణి హైదరాబాదు

ఆస్వాదించండి-



Monday, August 9, 2021

పూటకూళ్ళు - హాస్య నాటిక

 పూటకూళ్ళు  - హాస్య నాటిక





సాహితీమిత్రులారా!

పూటకూళ్ళు  - హాస్య నాటిక

రచన – బందా కనకలింగేశ్వర రావు గారు 

తరిణమ్మ – పి. సీతా రత్నమ్మ గారు 

సుబ్బారాయుడు – నండూరి సుబ్బారావు గారు 

వీరయ్య - బందా కనకలింగేశ్వర రావు గారు 

ఆకాశవాణి – హైదరాబాద్ ప్రసారం 

ఆస్వాదించండి- 




Sunday, August 8, 2021

తస్మాత్ జాగ్రత జాగ్రత - 2

తస్మాత్ జాగ్రత జాగ్రత - 2




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........



6. 
క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయో
   యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత

విత్తము, చిత్తము, జీవితము క్షణభంగురములు అంటే
అశాశ్వతములు. యమునికి కరుణలేదు.
కావున మేల్కొనండి మేల్కొనండి.

ఇక్కడ నుండి తస్మాత్ జాగ్రత జాగ్రత అని కాక
కా తత్ర పరివేదనా - అని చెప్పడం మొదలు పెట్టాడు.

7. యావత్కాలం భవేత్కర్మతావత్తిష్ఠంతి జంతవః
    తస్మిన్ క్షీణే వినశ్యంతి కా తత్ర పరివేదనా


ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో
అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే
మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి
బాధపడటం ఎందుకు.

8. ఋణానుబంధ రూపేణ పశుపత్నీసుతాలయః
    ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదనా

ఋణానుబంధము ఉన్నంతవరకే భార్యసంతానం
ఇల్లు పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే
ఇవన్నీ నశించిపోతాయి
అందుకు వ్యథ చెందడమెందుకు.

9. పక్వాని తరు పర్ణాని పతన్తి క్రమశో యథా
    తథైవ జంతవం కాలే కా తత్ర పరివేదనా

పండిన ఆకులు చెట్టునుండి రాలిపోతాయి.
అలాగే మరణం ఆసన్నమైనపుడు ప్రాణులు
మరణింస్తాయి. దానికి చింతించటం ఎందుకు


10. ఏక వృక్ష సమారూఢా నానాజాతి విహంగమాః
     ప్రభాతే విదితో యాంతి కా తత్ర పరివేదనా


చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం
ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు
అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు
వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ
నవసరములేదు.

11. ఇదం కాష్టం ఇదం కాష్ఠం నద్యం వహంతి సంగతః
     సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదనా

ప్రవహించే నదిలో రెండు కట్టెపుల్లలు దగ్గరకు చేరతాయి.
కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి.
అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచప్రవాహంలో కొంతకాలం
సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును

అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు., 

Thursday, August 5, 2021

తస్మాత్ జాగ్రత జాగ్రత-1

 తస్మాత్ జాగ్రత జాగ్రత-1




సాహితీమిత్రులారా!



ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే
చర్మకార దంపతులకు సునందుడు అను
బాలుడు పుట్టాడు. ఈ బాలుడుపూర్వజన్మలో
ఒక గొప్ప యతి. అందుకే 13 సంవత్సరాలకే
గొప్ప జ్ఞాని అనినాడు ఈ బాలుడు. ఒకరోజు
రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా
తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది.
అప్పుడు బ్రాహ్మీముహూర్తంలో సునందుడు
నగరప్రజలను మోల్కొల్పుతూ కొన్ని శ్లోకాలు చెప్పాడు
వాటిలోని నీతిశ్లోకాలు-

1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తిబంధు సహోదరాః
   అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత


తల్లిదండ్రులు, బంధు సోదరులు, గృహధనములు
జన్మతో వచ్చును. మరణముతో తెగిపోవునవి. ఇవేవీ
లేవని గ్రహించి జాగ్రత్త వహింపుడు.

2. జన్మదుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునఃపునః
   సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత


జన్మించుటయే దుఖించుటకు
వార్థక్యం దుఃఖకరము
భార్యవలన మరిన్ని దుఃఖములు
పుట్టుట చచ్చుట అను సంసారసాగరం
దుఃఖం - ఈ విషంలో మేల్కొనుడు మేల్కొనుడు

3. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠన్తి తస్కరాః
   జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత

కామము-క్రోధము-లోభము అనే ముగ్గురు దొంగలు
మనదేహంలో మకాం వేసి ఉన్నారు. వారు జ్ఞానమనెడి
రత్నమును దొంగిలించుటకే ఉన్నారు
మేల్కొనుడు మేల్కొనుడు

4. ఆశయా బద్ధతే లోకః కర్మణా బహుచింతయా
   ఆయుక్షీణం న జానన్తి తస్మాత్ జాగ్రత జాగ్రత


లోకులు ఆశకును కర్మకును కట్టుబడి
ఏవేవో విచారములతో జీవితములు
గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న
విషయాన్ని గమనించరు ఈ విషయంలో
మేల్కొనండి మేల్కొనండి

5. సంపద  స్సప్న సంకాశాః యౌవనం కుసుమోపహమ్
   విద్యుచ్చంచల మాయుష్యం తస్మాత్ జాగ్రత జాగ్రత


సంపదలు స్వప్నంు వంటివి అంటే అశాశ్వతాలు.
యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో
తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.
కావున మేల్కొనుడు  మేల్కొనుడు.

Tuesday, August 3, 2021

ఇలాంటి కుటుంబం ఉంటుందా!

 ఇలాంటి కుటుంబం ఉంటుందా!




సాహితీమిత్రులారా!



ఎంత చిత్రం!

మురారి కొయ్యబారాడా? కాదా!

పూరీ జగన్నాథుడు కొయ్యవిగ్రహమేగా!

ఎందుకట -

ఈ శ్లోకం చూడండి


ఏకా భార్యా ప్రకృతి రచలా చంచలా సా ద్వితీయా

ఏక పుత్రో సకల సృడభూత్ మన్మథో దుర్నివార:

శేషశ్శయ్యా శయన ముదధి: వాహనం పన్నగాశీ

స్మారం స్మారం స్వగృహ చరితం దారుభూతో మురారి:


ఒక భార్య భూమి(ప్రకృతి) ఆమెకు చలనం లేదు.

రెండవ భార్య లక్ష్మి బహుచంచల.

ఒక కొడుకు బ్రహ్మ అడ్డమైన సృష్టి చేస్తాడు.

రెండవకొడుకు మన్మథుడు వానికి పట్టపగ్గాలుండవు.

పడుకునే శయ్య పాము. పడక సముద్రంమీద -

పాము పీకుతుందో?  సముద్రం ముంచుతుందో?

వాహనం గరుత్మంతుడు పాములను తినేవాడు

ఇలాంటి చరిత్రగల తన ఇంటిని

తలచుకొంటూ తలచుకొంటూ

మురారి కొయ్యబారి పోయాడు.

ఎంత చిత్రం!


Sunday, August 1, 2021

"తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త" - నాటిక

 "తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త" - నాటిక 




సాహితీమిత్రులారా!

ఆకాశవాణిలో ప్రసారమైన

"తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త" - నాటిక 

 రచన: _జంధ్యాల 

నిర్వహణ : _సత్యం శంకరమంచి

 ఇక్కడ ఆస్వాదించండి-