Thursday, July 30, 2020

ఒక నాలుకతో పదివేల అబద్దాలు

ఒక నాలుకతో పదివేల అబద్దాలు




సాహితీమిత్రులారా!

పెరంబూదూరు రాఘవాచార్యుల వారి చాటుపద్యం చూడండి-
నల్లగొండ జిల్లా చందుపట్ల గ్రామపు దేశముఖ్ నరసింహారెడ్జి,
గ్రామంలోని సీతారామచంద్రస్వామివారి దేవాలయపు భూములను
కబ్జా చేసి అర్చకులైన రాఘవాచార్యుల కుటుంబాన్ని నానాబాధలు పెట్టాడట
ఆ సందర్భములో చెప్పిన పద్యం ఇది.

ఉరగధవుండు ప్రజ్ఞగల యుత్తముడంచు వచింప రెండువే
ల్గరు సగు నాల్కలుండిన నొకప్పుడు గొప్పని బొంకలేడహో
నరుడగు చందుపట్ల నరనాథుడు నర్సని ప్రజ్ఞ యెట్టిదో
గురుతగు నొక్క నాల్క పది కోటులు బొంకును ప్రత్యహం బిలన్


సర్పరాజైన శేషుడు ప్రజ్ఞావంతుడని ఉత్తముడని ప్రసిద్ధి పొందాడు.
అతనికి వేయి తలలు, రెండువేల నాలుకలు ఉన్నాయి. అయినా
అతడు ఒక్క అబద్ధం కూడ పలుకలేడు. కాని మనిషయిన మా గ్రామపు
దొర మాత్రం ప్రతిరోజు ఒక్కనాలుకతోనే పదికోట్లు బొంకులాడుతాడు.
ఆ నరసని ప్రజ్ఞ ఎంత గొప్పదోకదా! - అని భావం

Monday, July 27, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం




సాహితీమిత్రులారా!


శ్రీనాథుడు "ఫుల్లసరోజనేత్ర అల పూతన చన్నుల చేదుద్రావి" -
అనే పద్యం శ్రీకృష్ణునిమీద చెబితే
పెరంబూదూరు రాఘవాచార్యులుగారు
శంకరునిమీద ఈ పద్యం చెప్పాడు చూడండి.

గరళంబుం దిగ మింగినానని మహాగర్వంబుచే నుంటి వీ
వరయంగా మునగాల సీమ ఫలితం బై పేరు జెన్నొందుబం
దరు పొట్టీల ప్రసాదముం దినినమీ దన్ శ్రీధరాఖ్యుండవీ
కరణిన్మెక్కకపోతివేని బిరుదుల్గాల్పందగున్ శంకరా!

ఈ పద్యం నేటి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా
చందుపట్ల గ్రామనివాసి అయివ
పెరంబూదూరు రాఘవాచార్యులు గారు
వారానికొకసారి కోరాడ ప్రాంతపు మునగాల
పరగణాలోని గంగిశెట్టి గూడెం(బరాఖత్ గూడెం) అనే
గ్రామంలోని దేవాలయ ఉత్సవయాజ్ఞీకానికి వెళ్ళినపుడు
అక్కడివారు వడ్డించిన అన్నం తినలేక వ్యంగ్యంగా చెప్పినది.

ఓ శంకరా! నీవు పూర్వం హాలాహలం మ్రింగినానని చాల గర్వంతో ఉన్నావు.
కాని ఈ మునగాల సీమలో పండే బందరు పొట్టీల(ఒకరకం బియ్యం) అన్నం తిని
హరించుకుంటే అప్పుడు నిన్ను శ్రీధరుడు (విషాన్ని ధరించినవాడు) అని పిలువచ్చు.
ఆ అన్నం తినలేకపోతే నీకున్న ఆ బిరుదులు కాల్చదగినవి గాని సార్ధకమైనవికావు -
అని వ్యంగ్యంగా హాస్యపూరితంగా చెప్పాడట.

Saturday, July 25, 2020

ఆ ముగ్గురికి ఒకేసారి కన్ను ఎందుకు అదిరింది?


ఆ ముగ్గురికి ఒకేసారి కన్ను ఎందుకు అదిరింది?





సాహితీమిత్రులారా!

రామాయణంలో సీతకు, వాలికి, రావణాసురునికి
ఒకేసారి కన్ను ఎందుకు అదిరిందో తెలిపే 
గరికపాటి ప్రసంగ వీడియో వీక్షించండి-

Friday, July 24, 2020

విశ్వనాథవారి వేయిపడగలు - 8


విశ్వనాథవారి వేయిపడగలు - 8




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
8 వ భాగం వీక్షించండి.

Wednesday, July 22, 2020

విశ్వనాథవారి వేయిపడగలు - 7


విశ్వనాథవారి వేయిపడగలు - 7




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
7 వ భాగం వీక్షించండి.

Monday, July 20, 2020

విశ్వనాథవారి వేయిపడగలు - 6


విశ్వనాథవారి వేయిపడగలు - 6




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
6 వ భాగం వీక్షించండి.

Saturday, July 18, 2020

విఘ్నేశ్వరుని పూజించని బ్రాహ్మణుడు


విఘ్నేశ్వరుని పూజించని బ్రాహ్మణుడు






సాహితీమిత్రులారా!

ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ్వరుని పూజించనన్నాడట
ఎందుకో ఏమో గరికపాటివారి మాటల్లో  వినండి-


Wednesday, July 15, 2020

కాళిదాసు - భవభూతి


కాళిదాసు - భవభూతి




సాహితీమిత్రులారా!

కాళిదాసు - భవభూతి వీరిద్దరిలో ఎవరు గొప్ప
అనేదాన్ని గురించి గరికపాటి వారి ప్రసంగం
ఆస్వాదించండి -

Tuesday, July 14, 2020

విశ్వనాథవారి వేయిపడగలు - 5


విశ్వనాథవారి వేయిపడగలు - 5




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
5 వ భాగం వీక్షించండి.


Saturday, July 11, 2020

విశ్వనాథవారి వేయిపడగలు - 4


విశ్వనాథవారి వేయిపడగలు - 4




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
4వ భాగం వీక్షించండి.

Thursday, July 9, 2020

విశ్వనాథవారి వేయిపడగలు - 3


విశ్వనాథవారి వేయిపడగలు - 3




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
3వ భాగం వీక్షించండి.

Tuesday, July 7, 2020

విశ్వనాథవారి వేయిపడగలు - 2


విశ్వనాథవారి వేయిపడగలు - 2




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
2వ భాగం వీక్షించండి.


Sunday, July 5, 2020

విశ్వనాథవారి - వేయిపడగలు - 1


విశ్వనాథవారి - వేయిపడగలు - 1





సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు దూరదర్శన్ వారు
సీరియల్ గా తీసి ఉన్నారు వారి సీరియల్ లో
1వ భాగం వీక్షించండి.


Friday, July 3, 2020

బంగారానికి ఎన్ని పేర్లున్నాయి?


బంగారానికి ఎన్ని పేర్లున్నాయి?




సాహితీమిత్రులారా!

బంగారానికి గల పేర్లను
మాంగల్యశాస్త్రంలో కపిలవాయి లింగమూర్తి
108 పేర్లు చెప్పాడు అవి-

బంగారానికి అకారాది పేర్లు
(సంస్కృతం)
1. అకుప్యం, 2. అగ్ని, 3. అగ్నిబీజం, 4. అగ్నిజం, 5. అగ్నిభం
6. అగ్నిరజస్సు, 7. అగ్నివీర్యం, 8. అగ్నిశిఖ, 9. అగ్నిశేఖరం, 10. అభ్రం, 11. అమరం, 12. అర్జనం, 13.అవష్టంభం, 14. అష్టాపదం, 15. అగ్నేయం, 16.ఉజ్వలం, 17. ఔజసం, 18. కందళం, 19. కటంకటం, 20.కనకం, 21. కర్పూరం, 22. కలధౌతం, 23. కల్యాణం, 24. కాంచనం, 25. కాచిఘం, 26.కార్తస్వరం, 27.కుమారం, 28. కౌసుంభం, 29.గరుత్తు, 30. గాంగేయం, 31. గైరికం, 32. చంద్రం, 33.చాంపేయం, 34. చామీకరం, 35.జాంబవం, 36. జాంబూనదం, 37. జాతరూపం, 38. తపనీయం, 39.తామరసం, 40. తారజీవనం, 41. తాజం, 42. దళపం, 43. దాక్షాయం, 44. దీప్తకం, 45. దీప్తి, 46. ద్రవిణం, 47. నందయంతి, 48. నిష్కం, 49. పవిత్రం, 50. పింగాశం, 51. పింజరం, 52. పింజానం, 53. పీయువు, 54. పురరం, 55. భద్రం, 56.భరువు, 57.భర్మం, 58. భాస్కరం, 59. భూత్తమం, 60. భూరి, 61. భృంగారం, 62. మాంగల్యం, 63. మనోహరం, 64. మహాధనం, 65. మహారజతం, 66. హమారజతసం, 67. ముఖ్యధాతువు, 68. మృదాన్నకం, 69. రజతం, 70. రత్నవరం, 71. రసనం, 72. రుక్మకం, 73. రేకణం, 74. లోభనం, 75. లోహవరం, 76. వర్ణం, 77. వసువు, 78. వహ్నిజం, 79. శాతకుభం, 80. శిలోద్భవం, 81. శుక్రం, 82. శ్రీమకుటం, 83. సంచం, 84. సానసి, 85. సారంగం, 86. సురభి, 87. సువర్ణకం, 88. సౌమంజకం, 89. సమేచకం, 90. సౌమేవరం, 91. సౌవర్ణం, 92. స్పర్శమణి ప్రభవం, 93. స్వర్ణం, 94. హాటకం, 95. హారిద్రం, 96. హిరణ్యం, 97. హేమం
తెలుగు పేర్లు -
98. కడవన్నె, 99. కుందనం, 100. చిన్నిదం, 101. జమ్మేరుజంబాలం, 102.దినారి, 103. పసిడి, 104.పుత్తడి, 105. పైడి, 106. పొన్ను, 108. బంగరం, 109. బంగరు, 110. బంగారం, 111. బంగారు, 112. హొన్ను

(ఇందులో కొన్ని రూపాంతరాలున్నాయి. మొత్తం 108 పేర్లు)

Wednesday, July 1, 2020

రంగనాథరామాయణ కర్త గోనబుద్ధారెడ్డి


రంగనాథరామాయణ కర్త గోనబుద్ధారెడ్డి 





సాహితీమిత్రులారా!

రంగనాథరామాయణ కర్త గోనబుద్ధారెడ్డి ని గురించి
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారి ఉపన్యాసం
వీడియో వీక్షించండి-