Tuesday, November 30, 2021

జీవన్ముక్తుడు

 జీవన్ముక్తుడు




సాహితీమిత్రులారా!



జీవన్ముక్తుడు అంటే జీవించికూడా ముక్తి పొందినవాడు. 

అలాంటివాణ్ణి శంకరభగవత్పాదులవారు ఇలా వర్ణిస్తారు-


క్వచిత్ బాలై సార్ధం కరతలగతావై సహిసితైః

క్వచి త్తారుణ్యాలంకృత నవవధూస్సహరమన్

క్వచిత్ వృద్ధైశ్చింతాకలిత హృదయైశ్చాపివిసన్

మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాః


ఒకప్పుడు చేతులతో తాళాలు పుచ్చుకుని వాటిని మోగిస్తూ చప్పట్లు కొట్టడం,

కిలకిల నవ్వుతూ క్రీడా పరులైన బాలురతో ఆడడం, మరొకప్పుడు అలంకృతలైన

స్త్రీలతో చరిస్తూ ఉండడం, ఇంకొకప్పుడు సాంసారిక చింతాజాలంతో క్రుంగిపోయే 

ముసలివాళ్ళతో కలిసి విచారించడం, ఇన్ని విధాల చరిస్తున్నా జీవన్ముక్తుడు అయిన

 యతివరుడు జ్ఞానయోగదీక్షామహిమవల్ల దేహతాదాత్మ్య భ్రాంతిని పొందడు-

అని భావం

ఇలాంటి జీవన్ముక్తులు ఉన్నా మనం గుర్తించగలమా ఏమో

Sunday, November 28, 2021

పరోపకారం(కథ)

 పరోపకారం(కథ)





సాహితీమిత్రులారా!

పరోపకారం(కథ)

రచన - యమ్. వెంకటేశ్వరరావు



Friday, November 26, 2021

వందరెక్కల స్త్రీ (కథ)

 వందరెక్కల స్త్రీ (కథ)



సాహితీమిత్రులారా!

వందరెక్కల స్త్రీ (కథ)

రచన - యమ్. వెంకటేశ్వరరావు





Wednesday, November 24, 2021

సరస్వతీదేవి స్తుతి

 సరస్వతీదేవి స్తుతి




సాహితీమిత్రులారా!


నీలకంఠ దీక్షితులవారు నీలకంఠవిజయచంపువు 

అనే గ్రంథం కూర్చారు ఇందులోని ఇతివృత్తం(కథ)

సముద్రమథనం. ఇది మహాభాగవతం, బ్రహ్మాండపురాణం,

భారతం మొదలైన వాటిలో ప్రఖ్యాతి పొందినది.

ఇందులో కవిగారు కూర్చిన సరస్వతీదేవి స్తుతి

ఇక్కడ గమనిద్దాం-


దేవానామపి దైవతం గురుమపి ప్రాచాం గురూణామిహ

శ్రీమంతం మదనాంతకం కథమపి స్తోతుం కృతో నిశ్చయః

తేన త్వాం త్వరయామి భారతి బలాత్కృష్టా2పి దుష్టే పథి

ప్రాసేనోపహతాపి జాతు కుపితా మా స్మ ప్రసాదం త్యజః


దేవదేవుడూ, ప్రాచీనగురువులకు గురువూ, అష్టైశ్వర్యసంపన్నుడూ

అయిన మదనాతకుణ్ణి(శివుణ్ణి) ఏలాగైతేనేం స్తుతింప నిశ్చయించాను

(కామం బంధం, కామదహనం బంధవిముక్తి. ఆ ముక్తినిచ్చేవాడు శివుడు

మరొకడు కాదు) కావున ఓ భారతీ(సరస్వతీ) తొందరగా వచ్చి నేను చెప్పినట్లు 

నా రచనను వేగంగా సాగింపచేయి. వేదవేదాంతమార్గాల్లో విహరించే నిన్ను 

వికటాక్షర బంధ పారుష్యాది దుష్టమైన కావ్య మార్గంలో బలాత్కారంగా లాగుతున్నాను.

 ఛేకానుప్రాస వృత్త్యనుప్రాసలనే బల్లేలతో పొడుస్తాను. ఐనా ఏమాత్రం కోపగించక నాపై

 ప్రసాదం(అనుగ్రహం. నారచనలో ఝటిత్వర్థావగత రూపమైన ప్రసాదగుణాన్ని) చూపడం

 ఎప్పుడూ మానొద్దు (సరస్వతీదేవీ) - అని భావం


ఇది స్తుతిమాదిరైనా వుందా 

అంతా ఆజ్ఞాపించినట్లే సాగిందికదా 

ఈ ప్రార్థనా శ్లోకం


Monday, November 22, 2021

తీరని ఋణం తీరిపోయింది(కథ)

 తీరని ఋణం తీరిపోయింది(కథ)




సాహితీమిత్రులారా!

తీరని ఋణం తీరిపోయింది(కథ)

రచన - యమ్. వెంకటేశ్వరరావు



Saturday, November 20, 2021

పెంకుటిల్లు (కథ)

పెంకుటిల్లు (కథ)




సాహితీమిత్రులారా!

పెంకుటిల్లు (కథ)

రచన - యమ్. వెంకటేశ్వరరావు 



Wednesday, November 17, 2021

రోల్ మాడల్ (కథ)

 రోల్ మాడల్ (కథ)




సాహితీమిత్రులారా!

రోల్ మాడల్ (కథ)

రచన - యమ్. వెంకటేశ్వరరావు




Monday, November 15, 2021

శృంగార శతకంలోని పద్యం

 శృంగార శతకంలోని పద్యం




సాహితీమిత్రులారా!



పోలిపెద్ద వెంకన్నగారి లావణ్య శతకం 

శృంగారశతకం దీనిలోని

ఈ పద్యం గమనించండి-

ఇందులో నాయకుడు నాయికను బ్రతిమలాడుకొనే సన్నివేశంలోని పద్యం ఇది-

అతివ నేనొకసారి యానితే నీదు వా

                తెరతేనె లేమైన దరిగిపోనె

పణఁతి నేనిసుమంత పట్టితే నీచను

                బంతులంతటితోనె వాడిపోనె

యలుక లేమిటి కించుక బలుకరించంగానె

                పలుకులో నమృతంబు లొలికిపోనె

కడుఁబ్రేమ నొకసారి కౌఁగిలించంగానె

                కలికి నీతను వేమి కందిపోనె

వనిత నాతోడ నొకసారి కెనయగానె

దర్పకుని బొక్కసము కేమి తక్కువగునె

చాన నినుమాన నాతోన చలముబూన

వలెనటే శ్రీరామ రామ లావణ్యసీమ

                         (లావణ్య శతకం - 77)


Saturday, November 13, 2021

ఈ పదాలకు అర్థాలేంటి?

 ఈ పదాలకు అర్థాలేంటి?




సాహితీమిత్రులారా!



మనం ఇప్పుడు చాలమంది వ్రాసేవాటిలో

ఒత్తులు వుండవలసినదానికి తీసివేసి లేనిదానికి 

పెట్టడం గమనిస్తుంటాము

అలాంటి వాటిలో ఇదొకటి గమనించగలరు

సమాధానం / సమాదానం

సమాధానంలో ''ద'' కు వత్తు వుంది

సమాదానంలో ''ద'' కు వత్తు లేదు

సమాధానం అంటే అంగీకారం(సమ్మతి), ఉత్తరం అని అర్థాలు

సమాదానం అంటే ఇది బౌద్ధమతానికి చెందిన అర్థం

బౌద్ధులు నిత్యకృత్యమనీ, చక్కగా గ్రహించడమని అర్థాలున్నాయి


సంసారమార్గం అంటే

మిథ్యాజ్ఞానం, యోని అని రెండర్థాలు

Thursday, November 11, 2021

పురుషులే ప్రదర్శనలో పాల్గొనే నాట్యాలు

 పురుషులే ప్రదర్శనలో పాల్గొనే నాట్యాలు




సాహితీమిత్రులారా!



భారతదేశంలో పురుషులే ప్రదర్శనలో పాల్గొనే 

నాట్యాల సాంప్రదాయాలు-

1. కర్ణాటకల - బయలాట, యక్షగానం

2. తమిళనాడు- భాగవతమేళా, కణ్ణియంకూత్తు, తెరుక్కూత్తు

3. కేరళ - కృష్ణాట్టం, కథాకళి

4. గుజరాత్ - భవాయి

5. రాజస్థాన్ - ఖయాల్

6. హర్యానా - స్వాంగ్

7. కాశ్మీర్ - బాండ్ జస్నా

8. ఉత్తరప్రదేశ్ - నౌటంకీ(ఆగ్రా), భారత్ (బ్రజ భూమి)

                      రాసలీల (వారణాసి), రామలీల (రామ్ నగర్)

9. బెంగాల్ - జాత్ర

10. మణిపూర్ - జాత్ర

11. అస్సాం - అంకియ నట్ 

12. పశ్చిమ బెంగాల్ - చావ్ (చౌ)

13. బీహార్ - చావ్ (చౌ)

14. ఒరిస్సా -  చావ్ (చౌ), గోటిపువా

15.  ఆంధ్రప్రదేశ్ - కూచిపూడి, తూర్పుభాగవతం, వీధిభాగవతాలు


Tuesday, November 9, 2021

నవరంధ్రాలు అంటే ఏవి?

 నవరంధ్రాలు అంటే ఏవి?




సాహితీమిత్రులారా!



కొంతమంది మాట్లాడేప్పుడు నవరంధ్రాల్లో

మైనం పోస్తామని, నవరంధ్రాలు మూసుకు కూర్చో

అని రకరకాలుగా మాట్లాడుతుంటారు

అలాగే ఒక 

తోలు తిత్తియిది

తూట్లు తొమ్మిది

తుస్సుమనుట ఖాయం

జీవా తుస్సుమనుట ఖాయం

అని పాడుతుంటారు

(తూట్లు అంటే రంధ్రాలు)

అసలు నవరంధ్రాలంటే ఏవి

మనిషి శరీరంలో 9 రంధ్రాలున్నాయి

అవి తలలోనే ఎక్కువున్నాయి

చెవులు - 2

కండ్లు -   2

ముక్కు రంధ్రాలు - 2

నోరు - 1

మిగిలినవి పొట్టకు దిగువన ఉంటే మలమూత్రద్వారాలు రెండు

వెరసి 9 రంధ్రాలు

మానవుని మరణం ఈ రంధ్రాలగుండా పోతుందని

వీటిలో

తలలోని రంధ్రాగుండా పోతే పుణ్యలోకాలకు పోతారని

మిగిలిన వాటిగుండా పోతే పుణ్యలోకాలకు పోరని

నమ్ముతారు.

Sunday, November 7, 2021

యోగక్షేమాలు అంటే?

 యోగక్షేమాలు అంటే?




సాహితీమిత్రులారా!



మనం ఉత్తరాలలోనూ ఫోన్లలోనూ యోగక్షేమాలను

బంధువులను మిత్రులను పరామర్శిస్తుంటాము

అసలు యోగక్షేమాలంటే ఏమిటి?

అంటే ఏమీలేదు

సంపదను సమకూర్చుకోవడం యోగమట

దాన్ని భద్రం చేసుకోవడం క్షేమమట

రెండు కలిపితే యోగక్షేమాలు

Friday, November 5, 2021

ప్రియతమా!

 ప్రియతమా!




సాహితీమిత్రులారా!



పురిపండా అప్పలస్వామి గారి గేయం

1932లో వైశాఖిలో ప్రచురితమైంది.


ప్రియతమా!

ఈ కుసుమ విశ్వాస

మృదు పరీమళ లవమె

భరియింపలేదు నా

భాగ్యమెరుగని మనసు

              ప్రియతమా! నామ్రోల

               సురభిళోత్సవమేల

వలపె మరిచిన బ్రతుకు

కలలుగా జాలిగా

కనుమూసి కొను నిశాం

గనశయ్య నశియించు

           నలదోయి లేవెలుం

           గుల తారకయునేడు

కుములకే కుములకే

కుములునా చితిలోన

ఏ చిరంతన వాంఛ

లెగయునో పొగలుగా

         సవరింపకోయి నీ

         యమృత వీణా గళము

         ప్రియతమా! ప్రియతమా!

Wednesday, November 3, 2021

''పండగ రోజు'' రేడియో నాటకం

''పండగ రోజు''  రేడియో నాటకం




సాహితీమిత్రులారా!


"పండగ రోజు" - నాటకం 

రచన : శ్రీ నండూరి సుబ్బారావు 

నిర్వహణ : శ్రీ పాండురంగ

ప్రసారం - ఆలిండియా రేడియో హైదరాబాదు

ఆస్వాదించండి- 



Monday, November 1, 2021

శతక పద్యం

 శతక పద్యం





సాహితీమిత్రులారా!



అయ్యలరాజు రామభద్రునికి ముత్తాత
అయిన అయ్యలరాజు తిప్పయ్య
కృత రఘువీరా జానకీనాయక శతకంలోని
ఈ పద్యం చూడండి-

రవిసూనున్ బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినా డందునో
రవిసూనున్ గృప నేలి యింద్రసుతు బోరం ద్రుంచినా డందునో
యివి నీయందును రెండునుం గలవు నీకేదిష్టమో చక్కగా
రవివంశాగ్రణి తెల్పగదవయ్య రఘువీరా జానకీనాయకా

సూర్యుని కుమారుని చంపి ఇంద్రకుమారుని
రక్షించినాడని అందునా
రవికుమారుని కృపతో నేలి
ఇంద్రకుమారుని యుద్ధంలో చంపినాడందునా
నీకేది ఇష్టమో చెప్పవయ్య ఓ రువంశ వీరుడా!
జానకీనాయకా! ఓ రామా! అని అడుగుతున్నాడు

ఇందులో రెండింటియందు రవికుమారుడు,
ఇంద్రకుమారుడు అని అనడంతో కొంత పురాణ
ఇతిహాస పరిజ్ఞానం అవసం ఏర్పడుతున్నది.

రామాయణంలో వాలి ఇంద్రుని కుమారుడు,
సుగ్రీవుడు సూర్యునికుమారుడు
ఇక్కడ ఇంద్రునికుమారుని చంపాడు.

భారతంలో అర్జునుడు ఇంద్రునికుమారుడు,
కర్ణుడు సూర్యునికుమారుడు ఇక్కడ
సూర్యకుమారుడైన కర్ణుని చంపించాడు

రెండూ నువ్వే చేశావుకదా
వీటిలో నీకేది ఇష్టమో చెప్పవయ్యా
ఓ శ్రీరామచంద్రా అంటున్నాడు కవి.
ఎలా చెప్పగలడు మరి

ఇలాగే తిక్కన ఒక ప్రశ్నవేశాడు
హరిహరనాథునికి -
ఓ ప్రభూ, నీకు అస్థిమాల ఇష్టమా,!
కౌస్తుభం ఇష్టమా!, కాలకూటం రుచిగా ఉంటుందా?
యశోదాదేవి చనుబాలు రుచిగా ఉంటాయా?
సెలవియ్యవయ్యా -
అని అంటే ఏది కాదంటాడు ఆయన.