Saturday, November 5, 2016

కరము ద్విజిహ్వల గరిమ గాంచుట జేసి


కరము ద్విజిహ్వల గరిమ గాంచుట జేసి




సాహితీమిత్రులారా!


కొప్పరపు సోదరులను
గుంటూరు శతావధానంలో
కలాన్ని గురించి సీసపద్యం
చెప్పమన్నారట ఆ పద్యం-

కరము ద్విజిహ్వల గరిమ గాంచుట జేసి 
          అత్యుగ్ర ఫణిరాజ మనగవచ్చు
నెమ్మి సువర్ణాన నిర్మించుటను జేసి 
          యల శమంతక రత్న మనగవచ్చు
నీలోదకంబుచే నెగడు చుండుట జేసి
          అలయమునానది యనగవచ్చు
మంచి చెడ్డల నొక్క మాడ్కి నుండుట జేసి
          ఆత్మార్థ విజ్ఞానియనగవచ్చు
కాగితములను నదులపై గ్రాలుచుంట 
కలమనగ వచ్చుగాన నీ కలము మహిమ
మిట్టిదని వర్ణన మొనర్చ నెవని తరము
రమ్య కారుణ్య గుణసాంద్ర రామచంద్ర!

రెండు నాలుకలు ఉండటంవలన పామనవచ్చు.
బంగారంతో చేస్తారు కనుక శమంతక రత్నమనవచ్చు.
నల్లసిరా ఉంటుంది కనుక యమునానది అనవచ్చు.
మంచి చెడులు ఒకరీతిగా రాస్తుంది కనుక ఆత్మజ్ఞాని అనవచ్చు.
తెల్లని కాగితం అనే నదిమీద కదులుతూ ఉంటుంది
కనుక ఓడ అనవచ్చు. కలం మహిమ ఇంతటిది
అని వర్ణించడం ఎవరితరం
- అంటూ  కల్పన ఎంత అద్భుతంగా
ఎంత విచిత్రంగా చేశారో కదా


ఇప్పుడు నాడు వాడుతున్న కలం స్థానంలో
బాల్ పాయింట్ పెన్ ఎక్కువగా వాడుకలో ఉంది.

No comments:

Post a Comment