Friday, November 4, 2016

పచ్చిమిరపకాయ మహిత భక్తిని.......


పచ్చిమిరపకాయ మహిత భక్తిని.......



సాహితీమిత్రులారా!




కవి దక్షుడైతే దేనిమీదైనా
పద్యం చెప్పగలడు
అనడానికి ఉదాహరణ ఈ పద్యం-
పచ్చిమిరపకాయపై
తిరుపతి వేంకటకవులు
చెప్పిన సీసపద్యం

ఎద్దాని సంబంధ మెలమి గల్గిన మాత్ర 
        కూర లెల్ల మంచి గుణము గనునొ
కొత్తిమిరిని నూరుకొని తిన్న నెయ్యది 
        కంచె డన్నము తిన గలుగజేయు
ఎద్దాని శిశుజాల మెరుగక చేబట్టి
        కనులు నల్పగ మంట గలుగజేయు
ఎద్ది తా గ్రమముగా నెదిగి పండిన మీద
        జోటి కెమ్మోవితో సాటి యగునొ
నూరి దేనిని పుల్లనై మీరు మెంతి 
పెరుగులో గూర్చ స్వర్గము నెరుగజేయు
నరుల కెల్లను నాపచ్చిమిరపకాయ
మహిత భక్తిని నేను నమస్కరింతు


ఎంత చిన్న పదాలతో రమణీయంగా
మిరపకాయను వర్ణించారోకదా!

No comments:

Post a Comment