Thursday, November 10, 2016

నాతిగల బ్రహ్మచర్యము


నాతిగల బ్రహ్మచర్యము




సాహితీమిత్రులారా!


నూజివీడు సంస్థానాధిపతి నారయప్పారావుతో
ఒక కరణముకవి ఈ పద్యం మొరపెట్టుకున్నాడట.
జమాబందీ సమయంలో కరణాలు చాలామంది
వచ్చి నూజివీడులో చాలా రోజులుండాల్సివచ్చేదట.
భూములకు సంబంధించిన రెవిన్యూ లెక్కల వివరాలు
అన్నీ జమాబందీలో తేల్చేవారు. అందుకు చాలకాలం పట్టేది.
 అప్పుడు పరస్థలనివాసంవలన తనకు కలిగిన ఇబ్బందిని
కవి ఇలా పేర్కొన్నాడు-


శీతల స్నానంబును
భూతల శయనంబు నొంటిపూటశనంబున్
నాతిగల బ్రహ్మచర్యము
నా తరమా పూటగడప నారయభూపా!


ప్రతిరోజూ చన్నీళ్ళస్నానం,
నేలమీద నిద్రించటం,
ఒకపూట భోజనం,
భార్య ఉండికూడ బ్రహ్మచర్యాన్ని గడపటం
- ఈ పద్ధతితో రోజులు గడపటం
 నా వశంఅవుతుందా నారయప్రభూ! - అని భావం

No comments:

Post a Comment