Saturday, November 5, 2016

భీమకవి వీరుని తిట్టును రిత్తవోవునే


భీమకవి వీరుని తిట్టును రిత్తవోవునే



సాహితీమిత్రులరా!


తెలుగు సాహిత్యంలో అమోఘ వాక్కు
కలిగినవారు కొందరు తిట్టుకవులుగా
పేరు పొందినవారు అనేకురు ఉన్నారు.
వారిలో వేములవాడ భీమకవి మొదటివాడనవచ్చు.

ఆయన వాక్ప్రభావాన్ని వర్ణిస్తూ
ఆయన చెప్పుకొన్న పద్యం చూడండి-

రామునమోఘ బాణమును రాజశిఖామణి కంటి మంటయున్
భీము గదా విజృంభణ ముపేంద్రుని చక్రము వజ్రి వజ్రమున్
దామరచూలి వ్రాతయును దారక విద్విషు ఘోరశక్తియున్
వేమువవాడ భీమకవి వీరుని తిట్టును రిత్తవోవునే

రాముని బాణం, శివుని కంటిమంట, భీముని గదా
విజృంభణం, విష్ణు చక్రం, విధివ్రాత, కుమారస్వామి
శక్తి అప్రతిహతాలు, అనివార్యాలు. వేములవాడ భీమకవి
తిట్టుకూడ వాటి అంతటిదే అని తాత్పర్యం.

No comments:

Post a Comment