Wednesday, November 23, 2016

ఈ కళానిధివల్లనే కదా!


ఈ కళానిధివల్లనే కదా!



సాహితీమిత్రులారా!

బిల్హణుడకవి యామినీపూర్ణతిలకకు విద్యనేర్పే
సమయంలో పౌర్ణమినాటిరాత్రి
చంద్రుని వర్ణిస్తున్న పద్యాలలోని తరువాతి పద్యాలు---

ఈ కళానిధివల్లనే కదా! దిక్కు ది
           క్కులవారెల్లను దెలివిఁ గనుట,
యీ వసుఖని వల్లనే కదా! విబుధులు
        కోరికల్ దీఱంగఁ గుడుపుఁ గనుట,
యీ మహా విధువల్లనే కదా! సభ్యు లె
         న్నఁగ నిశాచరు లెల్ల దిగులు గనుట,
యీ సత్ప్రభునివల్లనే కదా! మోదించి
        కువలయం బెచ్చుగాఁ గూర్మి గనుట,
యవుర యీ రాజ మహిమ యే మనఁగ వచ్చుటఁ
దమము వారించి, యరుల సంతతి నడంచి,
యన్య రతి డించి, హరి పద మాశ్రయించి,
యుదయ గిరి దుర్గముననుండి యొప్పుచుండె.  - 58

ఈ యుదయాద్రి రాజత గిరీశ్వ, మీ సితభానుఁడెన్నదా
క్షాయణి నేలు శంకరుఁడు, కప్పు గళ చ్థవి, దాపు చుక్క వై
నాయకమూర్తి, యా ప్రమథ నాథులు తక్కిన చుక్కలున్, మహా
శ్రేయ మొసంగు స్వ ప్రరుచిఁ జెంది భజించు వియోగి పాళికిన్   - 59

ద్విజరాజటంచు భావించిచుటయేకాని
       రూఢిగా దోషాకరుండు వీఁడు,
సన్మార్గ గతుడంచు జనులు పల్కులె కాని,
         దండి మీఱిన నిశాటుండు వీఁడు,
నమృత కరుండంచు నాఖ్య మాత్రమె కాని,
        చర్చింపఁగా విష జనుఁడు వీఁడు,
కువలయ ప్రియుఁడంచుఁ గోరి సెప్పుటె కాని,
       పాడి తప్పిన తక్రవైరి వీఁడు,
తమము వారించు రాజను క్రమమె కాని
యేపు మీఱంగ నారుల నేఁచు వీఁడు,
ననుచుఁ గులటలు దూషింతు రనుచు, జనుల
త్రోవ రా వెఱచితొ నీవు తోయజారి!    -60

సురల తెరువు వో సాగితి,
వరయఁగ సత్పతి  వదే నిశాటుఁడవా నీ
కిర వొందఁగ విధు నామము
హరిహరి తలఁపంగఁ జెల్లునా కమలారీ?  - 61

కమలంబున జననం బయి,
కమలాసనుఁ డనఁగఁ బరగి, ఖర కర మతిచే
దమియింతురే వియేగులఁ?
గ్రమమున వా విడిచి మలిన గర్భుం డందున్ - 62

హరి కబళించుటల్, హరున కంబక మౌటఁ, దమిస్రయందుఁ దే
జరిలుట, నీటఁ బుట్టుటయు, ఛాయలు గాంచుట, మేను పెంచుటల్,

ధరణిధరంబు లెక్కుటయుఁ దగ్గుట, మిన్నులు ముట్టి వచ్చుటల్,
గరకరిఁ బాంథ కోటులను గాల్చుట, యగ్నికి సిద్ధమే శశీ!  -63

'పోర! మా యుసు రేల పోసికొనేవురా?
    తోరంపు నీ మేను దొండివోను,
జెలఁగి రా పేల చేసేవురా? ఖేచర
      పాళి నీ కండలు పంచుక తిన,
యీ లీల మము గాసి యేల పట్టేవురా?
       పర్వంబులను నిన్నుఁ బాము గఱవఁ,
గ్రోధించి మ మ్మింత వేధించ నేలరా?
       కాలారి విసరి ని న్నేలఁ గొట్ట'
ననుచుఁ బాంథులు నిందింప ననుదినంబు
లలిఁ బ్రవేశించెనో యీ కళంక మొకటి?
యటుల గాకున్న శుచిమూర్తి వైన నీకు
మలినతా వృత్తి గలుగునే జలజ వైరి!

'పొంచి యెంతయుఁ దోడఁ బుట్టిన దానిల్లు
        కంపవెట్టిన మహాఖలుంఁడు వీఁడు,
చలపట్టి వెస నిశాచర వృత్తిని స దాళి
       తేజంబు లడఁచు నిందితుఁడు వీఁడు,
కలఁగి ఘోషింపఁగాఁ గన్న తండ్రిని బట్టి
       భంగపెట్టిన ఘోర పాపి వీఁడు,
మెఱసి యాపయి నున్న మిత్రుని విభవంబుఁ
       జూడఁ జాలని నికృష్టండు వీఁ'డ
టంచు భువిలోన విరహిణు లాడుకొనఁగ,
సిగ్గు దోఁపక, మిన్నంది, చెలువు మీఱఁ
దిరుగుచున్నావు మీఁ దింత తెలియ లేక
తాళు వెన్నెల చీఁకట్లు ధవళకిరణ!     - 65

మేర తప్పనివాఁడు మేదిని నీతండ్రి,
        నిత్య జీవన వృత్తి నీదు తల్లి,
యిష్ట సంపద లెల్ల నిచ్చు నీ తోఁబుట్టు,
        నెమ్మి శ్రీ గలవాఁడు నీదు బావ,
వర సుమనో ధర్మ పరుఁడు నీ యల్లుండు,
      నిర్మల చిత్త నీ ధర్మపత్ని,
చక్ర పాలన కళా శాలి నీ మిత్రుండు,
       విబుధుల పాలు నీ వితరణంబు,
తమము వారించు నీదు సందర్శనంబు,
నిఖిల జనులకు మోదంబు నీదు మూర్తి,
యిట్టి సంపద గలుగు నీయట్టి రాజు
కోరి చూచినఁ గలఁడె యో కువలయేశ!  -66

No comments:

Post a Comment