Saturday, January 7, 2017

జలాక్షరముల నీచత నణగున్


జలాక్షరముల నీచత నణగున్




సాహితీమిత్రులారా!


సుకవుల కవిత్వం కుకవుల
కవిత్వం ఎలా ఉంటుందో
ఈ పద్యం చెబుతున్నది
సకలనీతి కథానిధానములోనిది
ఈ పద్యం.

సుకవులు చెప్పిన కవితా
నికరములు శిలాక్షరముల నిలుకడ గాంచున్
గుకవులు చెప్పిన కవితా
నికరములు జలాక్షరముల నీచత నణగున్
                                                           (సకలనీతికథానిధానము - 1 - 10)


సుకవుల కవిత్వం శిలలపై చెక్కిన
అక్షరాల్లా నిలకడగా ఉంటాయి.
మరి కుకవులు చెప్పిన కవిత్వం
నీటిపై రాసిన రాతల్లా చెరిగిపోతాయి
- అని భావం

No comments:

Post a Comment