Saturday, June 4, 2016

యటైన వాసి మీసాలు లౌకికాగ్రేసరులకు


యటైన వాసి మీసాలు లౌకికాగ్రేసరులకు


సాహితీమిత్రులారా!
మీసాల వల్ల కలిగే ఇబ్బందులను చెప్పమని ఒకమారు
తిరుపతివేంకటకవులను అడగ్గా
ఈ పద్యం చెప్పారట
చూడండి.

మెసవుచో సన్నంపు మెతుకులో జిక్కిన బైవారి నెల్ల నవ్వంగ జేయు
దన ముద్దియను ముద్దుగొనినచో నత్తులో దవిలి యత్యంత బాధను ఘటించు
పొడుము పీల్చిన రెల్లుకడ లంకవృద్ధిచేసినయట్లు మాలిన్యమును ఘటించు
తేనె పానము సేయుచో నెఱుంగక కొంచెముగ దగిల్చిన దెలుపున ఘటించు
పొట్టి దౌ చుట్ట గాల్చినప్పు డొక కొంత
కాక దగిలిన సురసుర కాలి పాడు
వాసన ఘటింపజేయు వహ్వా యటైన 
వాసి మీసాలు లౌకికాగ్రేసరులకు


(అన్నం తినేప్పుడు మీసాల్లో మెతుకు ఇరుక్కుంటే
చూసేవారికి నవ్వుపుడుతుంది.
ముద్దియను ముద్దు పెట్టుకుంటే నత్తు(ముక్కురాయి)లో
తగిలితే బాధ.
నశ్యం పీలిస్తే , మూతిపైని వెంట్రుకలకు తగిలితే
మాలిన్యాన్ని కలిగిస్తుంది.
తేనె తాగేటప్పుడు పొరపాటున తగిలితే,
తగిలిన భాగం తెల్లబడుతుంది.
చుట్ట కాల్చేటప్పుడు చివరిదాకా పీలిస్తే,
ఆ కాడ తగిలి పొరపాటున వెంట్రుకలు
కాలి దుర్వాసన రావచ్చు.
అయినా సరే,
లౌకికులకు మీసాలు వాసి(పేరు)నే కలిగిస్తాయి.)

No comments:

Post a Comment