Monday, August 8, 2016

చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు.....


చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు.....


సాహితీమిత్రులారా!

శ్రీనాథుని తరువాత అలాంటి కవిత్వాన్ని ఆయనకు సాటిగా
చెప్పినవాడు వినుకొండ వల్లభరాయుడు 
క్రీడాభిరామము(వీథి) రచించివాడు.
ఆయన మోపూరి భైరవుని ఉపాసించి కవితావల్లభుడైనాడని అంటారు.
వల్లభరాయడు  భైరవునిపైని చెప్పిన పద్యం ఇప్పుడు చూద్దాము.
ఇది క్రీడాభిరామం(వీథి)లో లేదు కాని ప్రబంధరత్నాకరంలో ఉందని
పెదపాటి జగన్నాథకవి చెప్పియున్నారు.
చూడండి.

చంద్ర ఖండ ములతో సరివచ్చు ననవచ్చు విమలదంష్ట్రా ప్రరోహములవాని
పవడంబు కొనలతో ప్రతివచ్చు ననవచ్చు కుటిల కోమల జటాచ్చటల వాని
ఇంద్ర నీలములతోనెనవచ్చు ననవచ్చు కమనీయతర దేహ కాంతి వాని
ఉడురాజ రుచులతో నొరవచ్చు ననవచ్చు చంచన్మదాట్టహాసములవాని
సిగ్గుమాలిన మొలవాని చిరుతవాని ఎల్లకాలంబు ములికి నాడేలువాని
అర్థి మోపూర నవతారమైన వాని భైరవుని గొల్వ వచ్చిరి భక్తవరులు

(భీషణ సుందర దంష్ట్రలతో, ఎర్రని జడలతో, వెన్నెల వంటి నవ్వుతో,
నల్లని తనువుతో దిగంబరుడైన బాలభైరవుడు
ములికినాడు ప్రాంతములోనివాడని భక్తులు
ఆ మోపూరు భైరవుని భక్తితో కొలుస్తారని - భావం)

No comments:

Post a Comment