Thursday, August 25, 2016

మన్మథ బాణములనగా ఎలాంటివి?


మన్మథ బాణములనగా ఎలాంటివి?


సాహితీమిత్రులారా!

శాలివాహన గాథాసప్తశతిని చాల మంది అనువదించినారు.
వారిలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారొకరు.
ఆయన అనువాదంలోని ఒకగాథ చూడండి.

ఒకానొక మగువ మన్మథబాణాలు అంటే ఎలాంటివి? -  అని
మరొక ప్రౌఢస్త్రీని అడిగిందట.
దానికి ఆమె సమాధానం ఈ పద్యంలో చూడండి.

ఎదురిపడి, ముందుకుఁజని,
పదపడి వెనుదిరిగి, ప్రియుఁడు పఱపిన మోహో
న్మద దృష్టులె మాపాలికి 
మదనశరము; లెవ్వరెట్లు మదిని దలఁచినన్ 
                                 (శాలివాహన గాథాసప్తశతి -142)

ఎవరు ఏమనుకొన్నా ప్రియుడు చూచిన
మోహముతో కూడిన చూపులే మాపాలిటి
మన్మథబాణాలు - అని అన్నదట.

ఇది వాహవరాయడు అనే కవి రచించినది
హాలుడు తన సప్తశతిలో సంకలనము చేసినాడు.

No comments:

Post a Comment