Saturday, August 6, 2016

నన్నియు నన్నివంకలన్


నన్నియు నన్నివంకలన్


సాహితీమిత్రులారా!

పెదపాటి ఎర్రాప్రెగడ రచిత కుమారనైషధములోని
ఈ పద్యాన్ని చూడండి.
దమయంతి సౌందర్యాన్ని వర్ణించు
సందర్భములోనిది ఈ పద్యం.....

అలికుల మెల్ల వేణియును హంసములెల్లను మందయానముల్ 
జలజము లెల్ల నెమ్మొగము జక్కవలెల్లను చన్నుదోయి యా
పులినము లెల్లఁ బెన్పిఱుఁదు పుష్పములెల్లను మేనివాసనల్
పొలఁతుక నాక్రమించుకొనిపోయె నన్నియు నన్నివంకలన్

(దమయంతిని - తుమ్మెదలు వేణి(జడను)ని,
హంసలు మందయానం(మెల్లని నడక)ను,
పద్మాలు మొగమును, జక్కవలు(చకోరపక్షులు) చనుగవను,
ఇసుకతిన్నెలు పెద్ద పిరుదులను,
పువ్వులు శరీరవాసనను
అన్ని అన్నివైపులా ఆమెను ఆక్రమించేశాయి - అని భావం)

No comments:

Post a Comment