Wednesday, August 10, 2016

వదిలించుకోవాలంటే ప్రాణంమీది కొచ్చినంత


వదిలించుకోవాలంటే ప్రాణంమీది కొచ్చినంత


సాహితీమిత్రులారా!

ఏదైనా ఒకటి సరదాగా మొదలు పెడతారు
తరువాత దాన్ని వదిలించుకోవాలంటే అంత కష్టం
అలాంటిదే ఒక కవి ఈ శ్లోకంలో తెలిపాడు చూడండి.

అధికారంచ, గర్భంచ, ఋణంచ, శ్వనబంధనమ్
ప్రవేశే సుఖమాప్నోతి నిర్గమే ప్రాసంకట:

అధికారం, గర్భం, ఋణం, శునకబంధనం -
ఇవి ప్రారంభంలో ఆనందంగానే ఉంటుంది.
కాని వదిలించుకోవాలంటే మాత్రం
ప్రాణం మీదికి వచ్చినంత పనవుతుంది
- అని శ్లోక భావం.
నిజమేకదా!
కాదంటే ఒకసారి ఆలోచించండి.

No comments:

Post a Comment