Wednesday, July 6, 2016

గొడుగు సరే గిడుగు ఏమిటి?


గొడుగు సరే గిడుగు ఏమిటి?


సాహితీమిత్రులారా!

మన భాషా పదాలు వాడకపోవటం వల్ల
మరుగున పడిపోతున్నాయన్నది వాస్తవం.
వాటిలో కొన్నయినా మనం తెలుసుకుందాము.
వాటిని వీలైన చోట ఉపయోగిద్దాం.

రేపు అంటే ఇప్పుడు బలాత్కారం అని
అందరు సులభంగా చెప్పేయగలరు.
అంతగా మారిపోయింది మన భాష.

రేపు - ప్రొద్దుట  
మాపు - సాయంత్రం
గొడుగు - కర్రవున్న గొడుగు  
గిడుగు - కర్రలేని గొడుగు
కామ - గొడుగులోనికర్ర
తెర్లించు - నీళ్ళను మరగించుట  
తొర్లించు - కాచిన నీటిని చల్లార్చుట
అప్పళం - అప్పళము(అప్పడము)
దప్పళం - పులుసు
పంగనామము - నడుమ ఎడముగలుగ
                         పంగవలె తీర్చిన తిరుమణి
బుంగనామము - తెల్లనామమునకు ఎర్రనామమునకు
                            మధ్య ఎడమ లేకుండ తీర్చిన తిరుమణి
కన్నెబావి - నీళ్ళులేని బావి
నడబావి - నడచిపోవుటకు మెట్లుగల బావి
ఇలువరము - గోడలు ఎత్తులేని గుడిసె
ఉఱ్ఱుకట్టు - పాలు పిండునపుడు ఆవు కాళ్ళను కట్టుట
తలకోల - సాధువుకాని ఆవును పిదుకునపుడు కొనను
                తాడు కట్టి దాని కొమ్ములకు తగిలించి పట్టుకొనెడి కోల

No comments:

Post a Comment