Friday, July 8, 2016

శ్రీసాయి శతకము


శ్రీసాయి శతకము

                                                                                -------శ్రీఅలంకారం కోటంరాజు

ఇటులన్ జేతువటంచు నేనెఱుగ - మున్నే నాడు నూహింప, నీ
వెటులన్ జేయగలేదు, లేదనిన నాయీ పాట్లకున్ కారణం
బెటులన్ గల్గెను నీవె చెప్పుము - దయాహీనుండవా కావె న
న్నెటులన్ దేర్తువొ నీదె భారమిక షిర్దీ సాయినాథ ప్రభూ!    - 11


నిద్రాణంబయిపోయె, సత్యమిదె - నిన్నేమందు, కన్విందుగా
క్షుద్రున్ నాదఱి జేరి యేదొ ముదమున్ గూర్పంగ యత్నింపవా
ముద్రింపించితి నాడు డెందమున - నీ పూర్వంపు రూపంబు - ని
ర్ణిద్రంజెందకు మెంత లేయనుచును షిర్దీ సాయినాథ ప్రభూ!  -12


పనులన్ మానితి పంచజేరితిని - నా పాట్లెన్ని యో యాయె - నీ
వున్ కన్దోయిని యచ్చకాంతులవియేవో మేనిపైజల్లవే
కనవా మానిసిగాగ నన్ను, యిదియే కాఠిన్యమో యేది - జా
రిన నాగుండియ చక్కదిద్దు మిక షిర్దీ సాయినాథ ప్రభూ!   - 13


పడిగాపుల్ బడినారు నిన్నుగని - సంప్రార్థించి - యర్థింప - నీ
గుడిముందే పదినాళ్ల నుండియు - దయాకూపారా వ్యాపారమె
క్కడ లేదీయవనీతలాన మదిలో కాఠిన్యమున్ బూని - వె
ల్తిడి లోకంబున నానబోకుమిక షిర్దీ సాయినాథ ప్రభూ!   - 14


దట్టంబైయిరులెట్లు గ్రమ్మినవొ సాంద్రంబౌచు నల్దిక్కులన్
ఎట్టూహింపగరాని చీకటిది - నాకే మంచు నీవుంటి - వీ
లట్టాలన్ని పడంగ నాయె - తుద కేలా యిట్టులైనావు - నీ
వెట్టాగైనను సర్దుకోవలెను షిర్దీ సాయినాథ ప్రభూ!        - 15

No comments:

Post a Comment