Monday, July 25, 2016

కవితాకన్యా వృణేతి స్వయమ్


కవితాకన్యా వృణేతి స్వయమ్


సాహితీమిత్రులారా!

ఈ చమత్కారశ్లోకం చూడండి.
కవితాకన్య ఎవరిని వరిస్తుందో తెలుస్తుంది.

నైవ వ్యాకరణజ్ఞమేతి పితరం నభ్రాతరం తార్కికమ్
దూరాత్ సంకుచతీవ గచ్ఛతి వపు: చండాలవత్ ఛాందసాత్
మీమాంసా నిపుణం నపుంసకమితి జ్ఞాత్వా నిరస్యాదరాత్
కావ్యాలంకారణజ్ఞమేవ కవితాకన్యా వృణేతే స్వయమ్

కవితాకన్య వ్యాకరణపండితుని తండ్రిగా భావిస్తుంది.
తార్కికుని సోదరునిగా తలుస్తుంది.
ఛాందసుని(ఛందశ్శాస్త్ర పండితుని) చండాలునిగా
భావించి దూరంగా తొలగుతుంది.
మీమాంసాపండితుని నపుంసకునిగా భావించి నిరసిస్తుంది.
కావ్యాలంకార పద్ధతుల తెలిసిన రసజ్ఞుని మాత్రమే
కవితాకన్య వరిస్తుంది
- అని భావం.

No comments:

Post a Comment