Wednesday, May 3, 2017

కాలము దుస్తర మెట్టివారికిన్


కాలము దుస్తర మెట్టివారికిన్




సాహితీమిత్రులారా!


కాలమహిమ ఇంత అంత అని చెప్పనెవరికి వీలౌతుంది
ఎటువంటివారికైనా కాలము దుస్తరము-
భర్తృహరి వైరాగ్యశతకంలోని ఈ శ్లోకం చూడండి-

ఇందులో కాలాన్ని పాచికలాడే
జూదరితో పోలుస్తున్నాడు చూడండి-

యత్రానేకే క్వచి దపి గృహే తత్ర తిష్ఠ త్య థైకో
యత్రా వ్యేక స్త దను బహవ స్తత్ర నైకో2పి చాన్తే,
ఇత్థం చౌమౌ రజనిదివసౌ దోల య న్థ్వా వివాక్షౌ
కాలః కాళ్యా భువనఫలకే క్రీడతి ప్రాణిశారైః

లోకం అనే వైకుంఠపాళి మీద కాళి-కాలుడు
అనే ఇద్దరు జూదరులు పాచికలు దొర్లిస్తూ
ఆడుతున్నారు. ఈ ఆటలో ఏ గడిలో మొదట
ఎక్కువ కాయలు లేదా పావులు ఉంటాయో
మధ్య కొచ్చే సరికి సంఖ్య తక్కువై చివరకు
ఒక్కటే మిగులుతుంది. అదీ కూడా అంతమైపోయి
ఆయ సమాప్తమౌతుంది. ఈ జగత్కేళి కూా అలాంటిదే
ఒక్కజీవి కూడ మిగలకుండా సర్వం లయమైపోతుంది.

అంటే - ప్రాణుల సంయోగ వియోగాలకు -
వృద్ధి క్షయాలకు కాలమే కర్త.

No comments:

Post a Comment