Saturday, May 19, 2018

ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకోవడమా?


ఇచ్చిన దాన్ని మళ్ళీ తీసుకోవడమా?




సాహితీమిత్రులారా!

లంకను జయించిన తరువాత లంకను
విభీషణునికి ఇచ్చేశాడు రాముడు.
కాని అక్కడి వస్తువేదో లక్ష్మణుడో
రాముడో ఒక దాన్ని తీసుకెళ్ళాలనిపించిందట
అప్పుడు జాంబవంతుడు చమత్కారంగా అన్న
శ్లోకం ఇది -

ఇన్ద్రం ద్వ్యక్షిధరం త్వమన్థముదధిం పంచాననం పద్మజం
చాబ్ధిం స్వాదుజలం శివం సితగలం కామం చ సద్విగ్రహమ్,
శైలాన్ పక్షధరాన్ స్తథైవ చ హయాన్లక్ష్మీపతిం పిఙ్గలం 
దృష్టం సర్వమిదం క్వ చిన్న రఘురాడ్ దత్తం స్వయంహారితమ్

ఓ రాఘవా!
 రెండు కళ్లున్న ఇంద్రుని,
మథించని సముద్రాన్ని,
ఐదు ముఖాలున్న బ్రహ్మదేవుణ్ణి,
మధురజలం వున్న సముద్రాన్ని,
తెల్లని కంఠంవున్న శివుణ్ణి,
మంచి శరీరం వున్న మన్మథుణ్ణి,
రెక్కలున్న పర్వతాలనూ,
గుఱ్ఱాలనూ, పచ్చని దేహమున్న
విష్ణువునీ ఇలాటివన్నీ చూచానుకాని
ఇచ్చిన దాన్ని మళ్ళీ
తీసుకోవడం మాత్రం
నేనెక్కడా చూడలేదు- అని భావం

No comments:

Post a Comment