Thursday, December 23, 2021

నేను రెండు తప్పులు చేశాను

 నేను రెండు తప్పులు చేశాను




సాహితీమిత్రులారా!



నమస్కారం గొప్పదనాన్ని తెలియచేస్తూ 

కువలయానందం  అనే అలంకారశాస్త్రంలో 

అప్పయ్య దీక్షితులవారు 

ఈ  పద్యం చెప్పారు గమనించగలరు-


వపుః ప్రాదుర్భావతః అనుమితమిదం జన్మని పురా

పురారే న క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్

నమన్ముక్తః సంప్రత్యహమతనుః అగ్రేప్యనతిమామ్

ఇతీశ క్షంతవ్యం తదిదం అపరాధ ద్వయమపి

ఓ పరమేశ్వరా!  రెండు తప్పులను చేశాను క్షమించు.

గత జన్మలో నేను నమస్కరించకపోవడం వల్ల ఇప్పుడు

జన్మనెత్తాను. ఈ జన్మలో నేను నీకు నమస్కరిస్తే ఇక జన్మ 

ఉండదు కనుక అపుడు నీకు నమస్కరించే అవకాశం 

లేదు కదా కనుక నా తప్పులను క్షమించు - అని భావం


No comments:

Post a Comment