Tuesday, December 14, 2021

పూజకు పువ్వులు

 పూజకు పువ్వులు




సాహితీమిత్రులారా!



ఏ పూవులను ఎవరి పూజకు ఉపయోగించాలో

ఇక్కడ కొంత విషయాన్ని తెలుసుకుందాం-


గణేశం తులసీ పత్రైః నవదుర్గాశ్చైవ దూర్వయా,

ముని పుష్పైః తథా లక్ష్మీకామో నచార్చయేత్

సంపదలపైన ఆపేక్షకలిగి దేవతలను పూజింపగోరేవారు తులసీ దళాలతో వినాయకుని, నవదుర్గలను, పార్వతిని పూజించరాదు. అవిశపూలతో సూర్యుని పూజింపరాదు అలా చేస్తే సంపదంతా పోయి ఏడేళ్ళు జ్యేష్టాదేవి ఇంటనిలుస్తుంది


జపా కుంద శిరీషైశ్చ యూధికా మాలతీ భవైః

కేతకీ భవ పుష్పశ్చ నై వార్చ్యః శంకర స్తథా

జపా, మొల్ల, దిరిసెన, మాలతీ, మొగలి పూలతో శివార్చన చేయరాదు


శిరీ షోన్మత్త గిరిజా, మల్లికా శాల్మలీ భవైః

అర్కజైః కర్ణికారశ్చ, విష్ణు నార్చ్యః సితాక్షతైః

దిరిసెన, ఉమ్మెత్త, కొండమల్లి, బూరుగు, జిల్లేడు, కొండగోగు - ఈ పూలతో మహావిష్ణువును పూజించరాదు. శూన్యఫలం. అంతేగాక తెల్లవిగాని, కుంకుమ, పసుపు కలిపిన అక్షతలు కూడ విష్ణువుకు ఉపయోగించరాదు. ఆ ఇంట లక్ష్మి ఉండదు. అపరిశుభ్రంగా, చేతులతో, గుడ్డలో కట్టుకు తెచ్చిన పూలు, భక్తిలేని అర్చనలు దైవానికి సమర్పితం కానేరవు.

No comments:

Post a Comment