Monday, June 29, 2020

ప్రత్యేక ముద్రికలు(ఉంగరాలు)


ప్రత్యేక ముద్రికలు(ఉంగరాలు)





సాహితీమిత్రులారా!
Legendary Telugu wordsmith Kapilavai Lingamurthy passes away- The ...
కపిలవాయి లింగమూర్తిగారి మాంగల్యశాస్త్రం
నుండి ప్రత్యేక ఉంగరాలను గురించి తెలుసుకుందాం -

ఈ పుస్తకంలో 5 ప్రత్యేక ఉంగరాలను గురించి వివరించారు.
వాటిలో మొదటిది సూర్యగ్రహణముద్రిక.

సూర్యోపరాగ సంప్రాప్తే లోహానాంత్రయ మిశ్రితం
తామరతామ్ర సువర్ణానాం - అర్క షోడశ రంధ్రభిః
అఖండంచ, ఇమాంకృత్యా - ముద్రికాం ధారణ శుభం

తా. సూర్యగ్రహణ సమయంలో వెండి 12, రాగి 18, బంగారం 10 పాళ్లు కలిపి ఒకచోట కరిగించి దానితో అతుకు లేకుండా ఉంగరం చేయించుకుని ధరిస్తే సమస్త గ్రహబాధలు తొలగిపోతాయి.

ఈ ఉంగరం తయారు చేసేవిధానం -
గ్రహణం ప్రారంభం కాగానే విశ్వకర్మ స్నానం చేసి అర్ధ్ర వస్త్రం కట్టుకొని కుంపటి, దాగలి మొదలైన పరికరాలు గ్రహణం కనిపించే ఆరుబయట పెట్టుకొని పైన చెప్పిన ప్రకారం లోహాలు మూసలో వేసి కరిగించవలె. అవి కరిగిన తరువాత మూసలో నుండి బొగ్గులు తొలగించవలె. అపుడు గ్రహణచ్ఛాయ దానిలో పడుతుంది.

          ఆ ఛాయ కరిగిన లోహంలో ప్రతిఫలించింది లేనిది చూచి పిమ్మట ఆలోహాన్ని అలాగే ముద్దగా గాని లేదా చిన్న బిళ్లగా గాని గాడిలో పోసి పిమ్మట ఆ బిళ్లను చదును చేసి దానికి నడుమ ఒక రంధ్రం సేయవలె. పిమ్మట దాన్ని ఒక కడ్డీపై ఎక్కించి ఉంగరంగా చరుచుతూ పోవలె. ఆ విధంగా ఉంగరానికి ఒక ఆకారం రాగానే ఇక గ్రహణం విడవకముందే దాని రంధ్రం నుండి గ్రహణాన్ని చూడవలె. గ్రహణాన్ని చూచిన పిమ్మట దానిని మళ్లీ ఒక కుంపటిలో వేయకూడదు.

         ఈ ఉంగరం చేసేప్పుడు శిల్పి అది ఏ గ్రహణంమైతే ఆ మంత్రం అనగా చంద్రగ్రహణానికి చంద్రుని మంత్రం, సూర్యగ్రహణానికి సూర్యుని మంత్రం జపించవలె. అలాగే ఉంగరం నుండి సూర్య చంద్రుల బింబాన్ని చూచేప్పుడు ఆ గ్రహణం రాహుగ్రస్తమైతే రాహుమంత్రం, కేతుగ్రస్తమైతే కేతుమంత్రం జపించవలె.

ఇది ఈ ఉంగరం తయారీవిధానం ఎంతగా వివరించారో కవిగారు.

2 comments:

  1. ఇంత వివరంగా సూక్ష్మంగా లోహ శాస్త్రం గురించి చెప్పారు అంటే ఎంతో పరిశోధన చేసి ఉంటారు ప్రాచీనులు. వాటి వెనుక ఉన్న రహస్యాలు లుప్తమై ఉండవచ్చు లేదా వెలుగు లోకి రాక పోవచ్చు. ఇప్పటికీ ఎన్నో తాళపత్ర గ్రంథాలు పరిష్కరించ బడలేదు అని చెబుతారు.

    అయితే, గత జన్మ కర్మల నుంచి బయట పడడానికి తగిన సాధన, సదాచారం లేకుండా కేవలం ఉంగరాలు దరించితే గ్రహ బాధలు తొలగిపోవడం జరగదేమో. కర్మ ఫలాలను అనుభవిస్తూ సదాచార వర్తనులైన తదుపరి ఈ పరిష్కారాలు చేసుకోవాలనే బుద్ధి కలిగి ఉపశమనం పొందుతారు అని చెప్పారు.

    ReplyDelete