Tuesday, December 14, 2021

పూజకు పువ్వులు

 పూజకు పువ్వులు




సాహితీమిత్రులారా!



ఏ పూవులను ఎవరి పూజకు ఉపయోగించాలో

ఇక్కడ కొంత విషయాన్ని తెలుసుకుందాం-


గణేశం తులసీ పత్రైః నవదుర్గాశ్చైవ దూర్వయా,

ముని పుష్పైః తథా లక్ష్మీకామో నచార్చయేత్

సంపదలపైన ఆపేక్షకలిగి దేవతలను పూజింపగోరేవారు తులసీ దళాలతో వినాయకుని, నవదుర్గలను, పార్వతిని పూజించరాదు. అవిశపూలతో సూర్యుని పూజింపరాదు అలా చేస్తే సంపదంతా పోయి ఏడేళ్ళు జ్యేష్టాదేవి ఇంటనిలుస్తుంది


జపా కుంద శిరీషైశ్చ యూధికా మాలతీ భవైః

కేతకీ భవ పుష్పశ్చ నై వార్చ్యః శంకర స్తథా

జపా, మొల్ల, దిరిసెన, మాలతీ, మొగలి పూలతో శివార్చన చేయరాదు


శిరీ షోన్మత్త గిరిజా, మల్లికా శాల్మలీ భవైః

అర్కజైః కర్ణికారశ్చ, విష్ణు నార్చ్యః సితాక్షతైః

దిరిసెన, ఉమ్మెత్త, కొండమల్లి, బూరుగు, జిల్లేడు, కొండగోగు - ఈ పూలతో మహావిష్ణువును పూజించరాదు. శూన్యఫలం. అంతేగాక తెల్లవిగాని, కుంకుమ, పసుపు కలిపిన అక్షతలు కూడ విష్ణువుకు ఉపయోగించరాదు. ఆ ఇంట లక్ష్మి ఉండదు. అపరిశుభ్రంగా, చేతులతో, గుడ్డలో కట్టుకు తెచ్చిన పూలు, భక్తిలేని అర్చనలు దైవానికి సమర్పితం కానేరవు.

Sunday, December 12, 2021

సీత రామునికి ఎలా భార్య?

 సీత రామునికి ఎలా భార్య?




సాహితీమిత్రులారా!

భూదేవి విష్ణువు భార్యకదా

మరి భూదేవి కుమార్తె సీత

రామునికి ఎలా భార్య అయింది

ఈ వీడియో చూడండి -




Friday, December 10, 2021

నాలుగు గడియలలో చెరువు ఎండింది

 నాలుగు గడియలలో చెరువు ఎండింది




సాహితీమిత్రులారా!



రెడ్డిరాజుల యుగంలో ఉన్న బడబానల భట్టు 

ఏవూరివాడో తెలియదు కాని ఒకసారి ఆయన 

త్రిపురాంతకం నుండి శ్రీశైలం వెళుతూ 

ఒకచోట మకాం చేశాడు. తెల్లవారుజామున స్నానం చేసి 

సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నపుడు చేతి ఉంగరం జారి చెరువులో పడింది 

వెంటనే అతడు ఏడింట టకారం పెట్టి ఈ పద్యం చెప్పాడు


బడబానల భట్టారకు

కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్ఘ్యం

బిడువేళ నూడి నీలో

బడియె దటాకంబ నీటి బాయుము వేగన్


ఈ పద్యం చెప్పిన రెండు గడియలలో చెరువు ఎండిందట 

కవిగారు తన ఉంగరం తీసుకొని చక్కాపోయాడు- అని 

అప్పకవి తన అప్పకవీయంలో ఈ పద్యాన్ని పొందుపరిచాడు.

Wednesday, December 8, 2021

నా జీవితము

నా జీవితము




సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కృష్ణ పక్షంలోని

కవిత నా జీవితము - ఆస్వాదించండి-


వింతగా దోచు నాదు జీవితము నాకె!

జిలుగు వెన్నెలతో చిమ్మచీకటులతొ;

అమల మోహన సంగీతమందు హృదయ

దళన దారుణ రోదన ధ్వనులు విందు;

వక్రగతి బోదు చక్కని పథమునందె,

రాజపథమునకై కుమార్గమున జూతు;

గరళమేతిందు కడుపార నెరిగి యెరిగి;

అవల ద్రోతు చేతులార నమృతరసము;

విస మమృతమట్టు లమృతంబు విసమురీతి;

చిత్రచిత్రగతుల మార్చు జీవితంబు! 

Monday, December 6, 2021

అమ్మ చెబితే వినాలి(కథ)

 అమ్మ చెబితే వినాలి(కథ)





సాహితీమిత్రులారా!

అమ్మ చెబితే వినాలి(కథ)

రచన - యమ్. వెంకటేశ్వరరావు



Saturday, December 4, 2021

పంచడప్పులు

పంచడప్పులు




సాహితీమిత్రులారా!



సంస్కృతంలో పంచకావ్యాలున్నట్టే తెలుగులో కూడ 

ఐదు ప్రౌఢప్రబంధాలను పంచకావ్యాలు అంటారు.

అవి 1. మనుచరిత్ర, 2. వసుచరిత్ర, 3. రాఘవపాండవీయం, 

4. శృంగారనైషధం, 5. ఆముక్తమాల్యద

ఇవికాకుండా పంచడప్పులనేవి బ్రౌన్ దొరగారి కాలంలో వెలుగులోకొచ్చాయి.

ప్రామాణిక పురాణాలలోని ప్రక్షిప్తాలను ఆధారం చేసుకొని ఆ పురాణపురుషులకు అంటగట్టి వ్రాసే కేవల కల్పనాకథలను పంచడప్పులు అంటారు - అని బ్రౌన్ దొరగారి పండితుల కథనం

పురాణడప్పులుగా చెప్పబడేవి 5

1. మైరావణ చరిత్ర, 

2. శతకంఠ రామాయణం, 

3. కృష్ణార్జున సంవాదం, 

4. గంగాగౌరీ సంవాదం, 

5. జైమినీ భారతం

జైమినీ భారతాన్ని తరువాతి కాలంలో తొలగించి 

కుశలవ కథ ను చేర్చారు బ్రౌన్ దొరవారు.

Thursday, December 2, 2021

నాన్న (కథ)

 నాన్న (కథ)



సాహితీమిత్రులారా!

నాన్న(కథ)

రచన - యమ్. వెంకటేశ్వరరావు