Wednesday, January 25, 2023

కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రారంభ పద్యం

 కృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యద ప్రారంభ పద్యం 




సాహితీమిత్రులారా!



కవిరాజచంద్రుడైన కృష్ణరాయల వారు తన ఆముక్తమాల్యదను---

" శ్రీకమనీయహారమణి- చెన్నుగదానును కౌస్తుభంబునన్"

అనిఉత్పలమాలతోప్రారంభించినాడు.

(రాజ)చంద్రుని దర్శనంతో ఆనందంగ వికసిస్తుంది ఉత్పలం. 

      ఆముక్తమాల్యదను అంటే గోదాదేవిని తమిళంలో "కోదై" అంటారు. 

కోదై అంటే మాల,పూలమాల అని అర్థం. పూలబాల(గోదాదేవి)ప్రణయచరితం

పూలమాలతో- అంటే ఉత్పలమాలతో ప్రారంభించడం రాయలవారి సందర్భో

చిత పద్యప్రయోగ నైపుణ్యం కావ్యా రంభంలోనె  కనపడుతోంది.

        పూలబాల(కోదై) వరించింది నల్లనయ్యను. కనుక నీలోత్పల స్మరణం

కూడా కావ్యారంభపద్యం ఉత్పలంలో ఉంది.నీలోత్పలం మదనుని పంచ

బాణాలలో చివరిదికూడ కావడ స్మర ణీయం.

    తన ప్రియురాలును ఎదలో ప్రతిష్టించుకొన్న వేంకటభర్తను కావ్యారంభంలో

స్మరించి,వేంకటభర్తకే కావ్యాన్ని అంకిత మీయడం విశేషం.

   గోదాదేవి వేంకటభర్తకు రాసిన ప్రేమ లేఖలే ఆమె రచించిన  "నాచ్చియార్

తిరుమొళి"ఆమెప్రేమలేఖలనఫలితమన్నట్లు రాయలవారుకూడ"కోదై" కి కావ్యంలో పెళ్లిచేసి

ఆనందభరితుడైనాడు.ఆఆనందభరిత ఆముక్తమాల్యదకావ్యాన్ని ఆంధ్రులకు

అందించిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవ రాయల వారు.

                    

వైద్యంవేంకటేశ్వరాచార్యులు

No comments:

Post a Comment