Tuesday, August 8, 2017

తిథి శబ్దం - వివరాలు


తిథి శబ్దం - వివరాలు




సాహితీమిత్రులారా!





తిథి అంటే శబ్దరత్నాకరంలో
1. పాడ్యమి లోనగునది
2. శ్రాద్ధదినము
అనే అర్థాలు ఇచ్చారు.

తన్యంతే కిలతా యస్మాత్తస్మాత్తాస్తిథ తిథయ స్స్మృతా
                                                                        -సిద్ధాంతశిరోమణౌ(కాలమాధవీయే)
తినోతి అనేపదం నుండి పుట్టింది ఈ తిథి అనే పదం.
తినోతి అనగా విస్తరించునది అని అర్థం
(చంద్రకళలను దినదినము పెంచుట)

తిథులు మూడు విధాలు-
1. ఖర్వ
2. దర్వ
3. హింస్ర

ఖర్వ - అనేది సమతిథి
            అంటే సూర్యోదయంనుండి మరునాడు సూర్యోదయము వరకు
            తిథి ఉండే తిథికి సమతిథి - ఖర్వ అని పేరు.

దర్వ - అంటే వృద్ధియైన తిథి అని అర్థం
       60 గడియలకన్నా ఎక్కువ ఉన్నతిథి.

హింస్ర - క్షీణత కలిగిన తిథి అని అర్థం.
                       60 గడియలకన్న తక్కువైన తిథి.


2 comments:

  1. ధన్యోస్మిఆర్యా

    ReplyDelete
  2. మా గురువుగారైన శ్రీశ్రీశ్రీ శ్రీమాన్ దిట్టకవి నరసింహాచార్యుల వారి అనుగ్రహ భాషణాన్ని వారి పేరుతో సహా ముద్రించి మా కందించిన మీయొక్క ఉన్నత మనస్తత్వపు మానవతా కృషికి దైవానుగ్రహం జోడించి నా యొక్క శిరస్సు వంచి మీ పాదములకు శత సహస్ర అనంత కోటి ధన్యవాదములు సమర్పించుకుంటున్నాను ఆర్య

    ReplyDelete