Saturday, January 20, 2018

కురు పాండవుల సేనానులు - వివరణ


కురు పాండవుల సేనానులు - వివరణ




సాహితీమిత్రులారా!




భారత యుద్ధం అంటే కురుక్షేత్రంలో
కౌరవుల సైన్యం  - 11 అక్షౌహిణులు
పాండవుల సైన్యం-  7 అక్షౌహిణులు
ఈ సైన్యాన్ని ఒక అక్షౌహిణి సైన్యనానికి 
ఒక సైన్యాధిపతి చొప్పున నియమించారు.
ఆ లెక్కన కొరవులకు 11 మంది సైన్యాధిపతులు
పాండవులకు 7 మంది సైన్యాధిపతులు
వారిపై ఒక సర్వసైన్యాధ్యక్షుడుంటాడు
యుద్ధప్రారంభంలోని సైన్యధిపతులు
కొరవుల సైన్యాధిపతులు -
1. కృపాచార్యుడు, 2. ద్రోణాచార్యుడు, 3. అశ్వత్థామ,
4. శల్యుడు, 5. జయద్రథుడు, 6. సుదక్షిణుడు,
7. కృతవర్మ, 8. కర్ణుడు, 9. భూరిశ్రవుడు,
10. శకుని, 11. బాహ్లికుడు.
వీరందరికి సర్వసైన్యాధ్యక్షుడు - 
10 రోజులు - భీష్ముడు
5రోజులు - ద్రోణుడు
2రోజులు - కర్ణుడు
1రోజు - శల్యుడు
వీరు కాక చివరిలో సైన్యమేలేకుండా
సైన్యధిపతి అయినవాడు అశ్వత్థామ

పాండవుల సైన్యాధిపతులు -
1. ద్రుపదుడు, 2. విరాటుడు, 3. ద్రుష్టద్యుమ్నుడు 4.శిఖండి,
5. సాత్యకి, 6. చేకితానుడు, 7. భీమసేనుడు

వీరందరికి 18 రోజులు యుద్ధం ముగిసేదాక
సైన్యాధిపతి - ద్రుష్టద్యుమ్నుడు

No comments:

Post a Comment