Sunday, January 14, 2018

కాలువలు దాటివచ్చేవారు చెప్పే కొలతలు


కాలువలు దాటివచ్చేవారు చెప్పే కొలతలు




సాహితీమిత్రులారా!

పూర్వం ప్రయాణాల్లో ప్రధానమైంది నడక
అలా నడచి వెళ్ళేవారు కాలువలు దాటాల్సి
వచ్చినపుడు వారు చెప్పే కొలతలు ఇక్కడ
తెలుసుకొందాము-

1. చీలగిర్తలకి - అరికాలు మీది అతుకు
2. ఓరడుమ్సులకి - చీలగిర్తలకి కాలి మడుసు(కీలు)కు మధ్య
3. బొట్టుముడుకు(మోకాలు)లకి - ముడుకు సమానం
4. ఎదురు తొడలకి - ముడుకుమీది మధ్యనుండి మడ్డితుంటికింది
                   మెత్తని భాగం
5. మక్కకీలకి - నడుముకింది ముడ్డిఅతుకు
6. మొలకట్లకి - కట్టుపంచె మొలతాడుకట్టుచోటు
7. బొడ్డు సేరుకు - బొడ్డు ఉన్న భాగం పరిమాణంలో 
                 కాలువ ప్రవహించుట 
8. చంకలకిందికి - చంకలెత్తు ప్రహించుట
9. కుత్తికెలకి - పీకెల ఎత్తు పరిమాణంలో ప్రవహించుట

కాలువల్లో ఎదురు తొడల ఎత్తు మించి ప్రవహించితే
ఆ కాలువ దాటి ప్రయాణించరు. మొలతాడు కట్టిన
హద్దు నుండి మెడపీకలవరకు ప్రవహించే కాలువ
ప్రమాదమని అందులో ఈతాడటంగాని, దాటే
ప్రయత్నంగాని చేయరు.

(గోదావరిలోయలో కొండరెడ్ల బతుకు కతలు - 2 వ్యాసం నుండి -
 వ్యాసకర్త - పల్లా బొర్రం రెడ్డి)

No comments:

Post a Comment