Wednesday, October 25, 2017

పంచభూత లింగాలు


పంచభూత లింగాలు




సాహితీమిత్రులారా!

పృథివి, అప్(నీరు), అగ్ని, వాయు, ఆకాశములనేవి
పంచభూతములు. ఈ తత్వాలకు ప్రతీకలుగా ఐదు 
లింగాలున్నాయి. వీటినే పంచభూత లింగాలంటాము.
ఇవన్నీ మన దక్షిణ భారతదేశంలో ఉన్నాయి.

1. పృథివీలింగము-
   దీన్ని కొందరు రామేశ్వరంలోని రామలింగేశ్వరునిగా చెబుతున్నారు.
   మరికొందరు కాంచీపురంలోని ఏకాంబరేశ్వరునిగా చెబుతున్నారు.
   ఇక్కడ రెండింటిని తీసుకోవీలుంది. ఎందుకంటే రామాయణ  
   కాలంలో సీతారాములు మట్టితో(ఇసుకతో) ప్రతిష్ఠించినది
   ఈ లింగం. అలాగే కాంచీపురంలోని లింగాన్ని కామాక్షి 
   అమ్మవారు ఇసుకను లింగం చేసి ప్రతిష్ఠించినదని కథనం.


2. అపోలింగం -
   తమిళనాడులో శ్రీరంగానికి సమీపంలో జంబుకేశ్వరం అనే చోట
   అపో(జల)లింగం వుంది. జంబుకేశ్వరలింగం ఎప్పుడూ నీటిలో
   కనిపిస్తుంది. కనుక దీన్ని అపోలింగం అంటున్నారు.ఆపస్ 
   అంటే నీరు.


3. తేజోలింగం(అగ్నిలింగం)-
   తమిళనాడులోని అరుణాచలం(తిరువణ్ణామలై)అనే చోట 
   అరుణాచలేశ్వరలింగం ఉంది. ఇక్కడ కార్తీకమాసంలో
   కొండమీద వెలిగించే దీపం చాలా దూరం కనిపిస్తుంది.
   ఇది అరుణాచలేశ్వరునికి తేజస్సుకు సంకేతంగా భావిస్తారు.



4. వాయులింగం-
   ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో ఉన్న శివలింగం.
   శ్రీకాళహస్తీశ్వరునిగా పిలుస్తున్నాము. ఈ దేవాలయంలో
   శివలింగం ఎదురుగా ఉన్న దీపాలలో ఒకటి కొద్దిపాటి
   గాలికి కదులుతూ కనిపిస్తుంది.. అది శివుని ఉచ్ఛ్వాస
   నిశ్వాసల వల్ల జరుగుతూ ఉంటుందని అదేవాయు
   లింగానికి ఆధారమని అంటారు.

5. ఆకాశలింగం-
   తమిళనాడులోని చిదంబరంలో ఉంది ఈ ఆకాశలింగం.
   చిదంబరం నటరాజస్వామి ఆలయానికి కూడ ఆకాశలింగమని 
   ప్రసిద్ధి ఉంది. ఇక్కడ నటరాజస్వామి విగ్రహం పక్కన చీకటిలో
   శూన్యప్రదేశం కనిపిస్తుంది. ఈ శూన్యమే ఆకాశానికి ప్రతీక   
    

ఇవి పంచభూత లింగాలు. వీనిలో ఒక్క వాయులింగం తప్ప అన్నీ
తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి.

No comments:

Post a Comment