Thursday, September 1, 2016

ఎట్లువచ్చెనో దీనికింత చదువు?


ఎట్లువచ్చెనో దీనికింత చదువు?


సాహితీమిత్రులారా!

అప్పుడప్పుడే చదవడం
ఆరంభించిన ఒక బాలుని ఊహ -
బొంగరాన్ని జాటీతో చుట్టి నేలపై విసిరాడు
అది నేలపై గిర్రున తిరుగుతూంది
అది ఆ పిల్లవాడికి భూమిమీద ఏదో రాస్తున్నట్లనిపించింది
ఎంత సహజంగా ఉంది ఈ ఊహ -

పద్యం చూడండి.

రింగురింగున తిరుగు నా బొంగరంబు
ఏమియో వ్రాయుచున్న దీ యిసుకలోన-
బడికి పోలేదు, పొత్తము పట్టలేదు
ఎట్లు వచ్చినదో దీనికింత చదువు

ఆ పిల్లవాడికి తెలిసింది బడికి పోవాలె,
పుస్తకం పట్టాలె - అప్పుడు వ్రాటానికి శక్తి వస్తుంది-
అని మరదేదీ లేకుండా ఇది రాస్తుందంటే ఎంత ఆశ్చర్యం.
ఇది వాడికి కలిగిన భావన.

No comments:

Post a Comment